కురవి వీరభద్రుడికి ఎంపీ అభ్యర్థి కవిత పూజలు


Sat,March 23, 2019 01:55 AM

కురవి, మార్చి 22: కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శుక్రవారం టీఆర్‌ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత భద్రునాయక్ దంపతులు, పార్లమెంట్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ తోడు రాగా ప్రత్యేక పూజలు చేశారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్ సాధరంగా ఆహ్వానించారు. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వయంభూ అమ్మవారి ఆలయంలోనూ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కొణతం కవిత విజయ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట లాలయ్య, ఉపసర్పంచ్ సంగెం భరత్, సంగెం హర్షిత్, బాదె నాగయ్య, కటికనేని హరిత, సాంబలక్ష్మి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ ముండ్ల రమేశ్, బజ్జూరి వెంకట్‌రెడ్డి, కురవి గ్రామాధ్యక్షుడు మేక నాగిరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్, బాదె నాగయ్య, ఐలి నరహరి, బోడ శ్రీనివాస్, గుగులోత్ నెహ్రూ, బెడద వీరన్న, టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్ గుగులోత్ రవి, యానాల గంగాధర్‌రెడ్డి, చిన్నం భాస్కర్, కానుగంటి కృష్ణమూర్తి, కిన్నెర మల్లయ్య, బుక్క అశోక్, కేలోత్ అర్జున్ చౌహాన్, వద్దుల సురేందర్‌రెడ్డి, ప్రతాపని భిక్షమయ్య, బానోత్ తుకారాంనాయక్, మింగు సమ్మయ్య, విజయ, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతిగా మరోసారి రుజు వు చేసుకున్నారని మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత భద్రునాయక్ అన్నారు. కురవి వీరభద్రస్వామి పూజల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...డోర్నకల్ ఆడబిడ్డనని అత్యధిక మెజార్టీ దిశగా ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. నాపై నమ్మకంతో టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మరో సెట్‌ను 25వ తేదీన వేయనున్నట్లు తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...