టైలర్‌షాపు బాధితుడికి ఎమ్మెల్యే భరోసా


Sat,March 23, 2019 01:55 AM

రెడ్డికాలనీ: హన్మకొండ శ్రీనివాస టైలర్‌షాపు యజమానికి, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల దయానంద్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ భరోసా కల్పించారు. హన్మకొండ కాంగ్రెస్ భవన్ పక్కనగల శ్రీనివాస టైలర్‌షాపును కొందరు దుండగులు పెట్రోల్ పోసి దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ టైలర్‌షాపును సందర్శించి బాధితుడు శ్రీనివాస్‌ను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులకు కఠిన శిక్షపడేలా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మిర్యాల్‌కార్ దేవేందర్, రవీందర్, మాజీ కార్పొరేటర్ ఏలిమి సతీశ్, 40వ డివిజన్ అధ్యక్షుడు చెన్నం మధు, 41వ డివిజన్ అధ్యక్షుడు సిద్ధంశెట్టి శ్రీనివాస్, మేరు సంఘం అధ్యక్షుడు గూడురు వెంకటేశ్వర్లు, టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కటకం ఓంకార్, సీతా శ్యాం, మేరు సంఘం నాయకుడు తాళ్ల సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకుడు వెన్ను కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...