వైభవంగా ప్రారంభమైన ఎర్రగట్టు జాతర


Fri,March 22, 2019 03:18 AM

హసన్‌పర్తి, మార్చి 21: హసన్‌పర్తి-భీమారం ఉమ్మడి గ్రామాలు సంయుక్తంగా నిర్వహించే శ్రీఎర్రగట్టు వెంకన్న జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. హసన్‌పర్తి నుంచి పెద్ద రథచక్రాల బండి, భీమారం నుంచి చిన్న రథచక్రాల బండి మీద రాత్రి గుట్టకు చేరుకున్నారు. రాత్రి అలివేలు మంగమ్మ పద్మావతి శ్రీనివాస సమేత ఉత్సమూర్తుల ప్రతిమలకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో వైభవంగా కల్యాణం జరిపించడంతో ఐదు రోజుల పాటు జరిగే ఎర్రగట్టు వెంకన్న జాతర ప్రారంభమైంది. హసన్‌పర్తి-భీమారం నుంచి శ్రీఅలివేలు మంగమ్మ పద్మావతి శ్రీనివాస సమేత ఉత్సవ మూర్తులు రథ చక్రాల బండి మీద గట్టుకు బయలుదేరాయి. రాత్రి ఇరు గ్రామాలలో ఉత్సవ మూర్తుల ప్రతిమలకు భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎర్రగట్టు జాతర ఉత్సవ ప్రాంగణం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మహిళలు దారిపొడవునా కోలాటాలతో పాటలు పాడుతూ స్వామివారి ఉత్సవమూర్తులను గుట్టకు చేర్చారు.

భారీ బందోబస్తు నడుమ ఉత్సవ వేడుకలు
ఎర్రగట్టు వెంకన్న జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహస్తున్నారు. గుట్టపైకి ఎక్కేందుకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం
జాతర ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, ఆలయ చైర్మన్ అటికం రవీందర్‌గౌడ్, కార్పొరేటర్లు నాగమల్ల ఝాన్సీలక్ష్మీ, జక్కుల వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ తిరుమల్ స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఆలయ పూజారులు వేదాంతం పార్థసారధాచార్యుల, ఆరుట్ల శ్రీధరాచార్యు లు, శ్రీనివాసచార్యులు వేదమంత్రోచ్చరణలతో స్వామివారి కల్యాణం నిర్వహించారు.

ఎర్రగట్టుగుట్టకు రథంపై పయనం
భీమారం : గ్రేటర్ వరంగల్ పరధిలోని 57వ డివిజన్ ఎర్రగట్టుగుట్టలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 55వ డివిజన్ భీమారంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతగా వేంకటేశ్వరస్వామి రథంపై గురువారం రాత్రి బయలుదేరారు. భీమారంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతగా వెంకటేశ్వరస్వామివారికి దేవాలయ కమిటీ చైర్మన్ ఆట్టికం రవీందర్‌గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు, పురప్రముఖులు, భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ముందుగా అలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, శ్రీధరాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రగట్టుగుట్ట శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, అలయ కమిటీ సభ్యులు నాయకపు శ్రీనివాస్‌గౌడ్, నాయకపు సమ్మయ్యగౌడ్, రాయకంటి సురేష్, గడ్డం చంద్రమౌళి, బూర సారంగపాణి గౌడ్, రాధాకృష్ణ, రాజేష్, సతీశ్, వెంకటస్వామి, శరత్, చింత సత్యం, మహేందర్, త్యాగరాజ్ , కళాకారులు, భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...