రైల్వే గూడ్స్ గార్డుగా విధుల్లోకి చేరిన మరో యువతి


Fri,March 22, 2019 03:16 AM

కాజీపేట: దక్షిణ మధ్య రైల్వేజోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లోని కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో మరో యువతి మహిళ రైల్వే గూడ్స్ గార్డుగా గురువారం విధుల్లో చేరింది. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి సనత్‌నగర్‌కు వెళ్లే గూడ్స్ రైలుకు ఆమె విధులను నిర్వర్తించినట్లు రైల్వే ఏరియా మేనేజర్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఆయన కథనం మేకు.. రైల్వేలో కొంత కాలం క్రితం (ఆర్‌ఆర్‌బీ) రైల్వే రిక్రూట్ మెంట్ ద్వారా గూడ్స్ గార్డుగా కుమారి సులత ప్రధాన్ అనే అవివాహిత మహిళ రైల్వే గూడ్స్ గార్డుగా విధుల్లో చేరిందని తెలిపారు. రైల్వే జంక్షన్‌లోని స్థానిక రైల్వే కార్యాలయంలో క్లర్క్‌గా నిర్వర్తించినట్లు చెప్పారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇటీవల పది రోజుల పాటు కాజీపేట రైల్వే జంక్షన్‌కు చెందిన నైపుణ్యం గల సీనియర్ రైల్వే గార్డుల నేతృత్వంలో (ఎల్‌ఆర్) రూట్ లర్నింగ్‌లో పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించామన్నారు.

ఈ నెల 13న కాజీపేట రైల్వే జంక్షన్‌కు చెందిన తుమ్మ మాధవి రైల్వే గూడ్స్ గార్డు దక్షిణ మధ్య రైల్వేలో ప్రప్రథమంగా కాజీపేట రైల్వే జంక్షన్-సనత్‌నగర్ సెక్షన్‌లో యూటీసీఎం అనే గూడ్స్ రైలుకు గార్డుగా విధులు నిర్వర్తించిన విషయం తెల్సిందేనన్నారు. మరో మహిళా గూడ్స్ గార్డుగా సులతా ప్రధాన్ కాజీపేట రైల్వే జంక్షన్ యార్డు నుంచి సనత్‌నగర్ రైల్వే స్టేషన్ వరకు వీసీఎస్‌జీ అనే గూడ్స్ రైలుకు గార్డుగా పంపించామని వివరించారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే జంక్షన్‌లో గూడ్స్ రైల్వే గార్డులుగా ఉండి వివిధ రైల్వే శాఖల్లో క్లర్క్‌లుగా పని చేస్తున్న మిగతా మహిళా గార్డులను త్వరలోనే గూడ్స్ రైళ్లకు గార్డులుగా పంపించనున్నట్లు పూర్ణచందర్‌రావు చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు మహిళ రైల్వే గార్డు సులత ప్రధాన్ పనితీరును అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తూ గూడ్స్ రైలును ముందుకు తీసుకుంటున్నట్లు సమాచారం. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి రెండో మహిళగా పూర్తి స్థాయిలో గూడ్స్ రైలు గార్డుగా విధుల్లో చేరి, గూడ్స్ రైలును తీసుకెళ్లినందుకు మహిళా గార్డు కుమారి సులత ప్రధాన్‌ను స్థానిక రైల్వే అధికారులు, తోటి మెయిల్ గార్డులు, రైల్వే డ్రైవర్లు, కార్మికులు అభినందనలు తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...