30 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు


Fri,March 22, 2019 03:15 AM

వరంగల్,నమస్తేతెలంగాణ: బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు శుభవార్త. మార్చి 30 నుంచి నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు అందనున్నాయి. ప్రైవేట్ కమ్యూనికేషన్ కంపెనీలకు దీటుగా సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమైంది. 20 రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని ఏటూర్‌నాగారం, మంగపేట, రాజుపేట, తాడ్వా యి, మేడారం మండలాల్లో 4జీ సేవలు ప్రారంభించారు. 30వ తేదీ నుంచి వరంగల్ నగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మ హబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. నగర పరిధిలో సుమారు 20వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లను వినియోగిస్తున్నారు. వీరిందరికీ గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ 3జీ సిమ్‌లను మాత్రమే అంద జేసింది. ఇప్పటి నుంచి 4జీ సేవలు అందుబాటులోకి తెస్తున్న తరుణంలో సిమ్‌కార్డులను మార్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు వినియోదారులను కోరుతున్నారు.

సిమ్ మార్చుకుంటేనే సేవలు
ప్రస్తుత బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు సిమ్ మార్చుకుంటేనే 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్క నగర పరిధిలోనే 20 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులుగా ఉన్నారు. అ యితే మరో వారంరోజులలో 4జీ సేవలు ప్రారంభంకానున్న తరుణంలో ఇంకా సగం మంది వినియోగదారులు మాత్రమే సిమ్‌కార్డులను తీసుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చెప్పుతున్నారు. మిగితా వినియోగదారులు 28 వ తేదీ వరకు 4జీ సిమ్‌కార్డును తీసుకోవాలని కో రుతున్నారు. 29 తేదీ అర్ధరాత్రి నుంచి 4జీ సిమ్‌కార్డులను ఉపయోగంలోకి వస్తాయని చెబుతున్నారు.

వినియోగదారులకు మెసెజ్‌లు
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఇప్పటికే మెసెజ్‌లు పంపించామని ప్రిన్సిపల్ మేనేజర్ కందగట్ల నరేందర్ తెలిపారు. పోస్ట్ పెయిడ్ వినియోగిస్తున్న ప్రభుత్వ శాఖలకు 4జీ సిమ్‌లను తమ సిబ్బంది కార్యాలయాలకు వెళ్లి అందజేస్తున్నారని చెప్పారు. ఇతర వినియోగదారులకు కస్టమర్ సెంటర్లలో ఉచితంగా సిమ్‌కార్డులను అందజేస్తున్నామన్నారు. 30వ తేదీ లోగా 4జీ సిమ్‌కార్డులను తీసుకోవాలని సూచించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...