కేఎంసీలో కొనసాగుతున్న బాలికల క్రీడా పోటీలు


Fri,March 22, 2019 03:13 AM

పోచమ్మమైదాన్, మార్చి 21 : వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న అంతర్ వైద్య కళాశాల బాలికల క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. కేఎంసీ మైదానంలో ఏర్పాటు చేసిన బాలికల క్రీడా పోటీలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 కళాశాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థినులకు ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, త్రోబాల్, టెన్నికాయిట్, టేబుల్ టెన్నిస్, చెస్, బ్యాట్‌మెంటన్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరుగనున్న 11 అంశాలకు సంబంధించిన క్రీడా పోటీలు శుక్రవారం ముగియనున్నాయి. వివిధ కళాశాల నుంచి వచ్చిన బాలికులు హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకుని, ఎండలను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్‌సిద్ధార్థ, డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, డాక్టర్ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ ఖధీర్, పలు కశాశాల నుండి వచ్చిన వైద్యులు, మెడికోలు తదితరులు పాల్గొన్నారు

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...