వ్యక్తి ఆత్మహత్య


Fri,March 22, 2019 03:13 AM

ఖిలావరంగల్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘట న గురువారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని మినీ అండర్ రైల్వే బ్రిడ్జిపై చోటు చేసుకుంది. వరంగల్ రైల్వే ఏఎస్సై పరశురాములు కథనం మేరకు.. కరీమాబాద్‌కు చెందిన గట్టు విజయలక్ష్మి, మనోహర్ దంపతులకు చెందిన ఇద్దరు కుమారులు కూతురు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కాగా, పెద్ద కుమారుడు గట్టు రాజేంద్రప్రసాద్ (30) హైదరాబాద్‌లో తన తమ్ముడు, చెల్లికి చెప్పకుండా గుర్తు తెలియని రైలు ద్వారా వరంగల్‌కు చేరుకున్నాడు. అనంతరం హంటర్‌రోడ్డులోని మినీ రైల్వే అం డర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వద్ద లభించిన ఆధారాల ప్రకారం తల్లిదండ్రులకు సమాచారం అందించిట్లు పోలీసులు చెప్పారు. డిప్యూటీ ఎస్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృ తదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నల్లు వెల్లడించారు. అ యితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఏఎస్సై పేర్కొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...