ముగిసిన పోలీస్ ఈవెంట్స్


Thu,March 21, 2019 01:15 AM

వరంగల్ క్రైం,మార్చి 20 : పోలీస్ కొలువుల కోసం 31 రోజులుగా జెఎన్‌ఎస్‌లో నిర్వహించిన పోలీస్ శారీరక, దేహదారుఢ్య పరీక్షలు బుధవారంతో ముగిసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 31,179 మంది అభ్యర్థులు పోలీస్‌కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్స్ కోసం దరఖాస్తులు చేసుకోగా 27,487 మంది అభ్యర్థులు మాత్రమే ఈవెంట్స్‌కు హాజరయ్యారని చెప్పారు. హాజరైన వారికి , ఎత్తు, చాతి కొలతలు, 100,800 మీటర్స్ ఈవెంట్స్ నిర్వహించగా 14,024 అభ్యర్థులు ఎంపికై తది పరీక్షకు మెయిన్స్ అర్హత సాధించారు. వీరిలో 10,712 మంది పురుషులు కాగా 3.312 మంది మహిళలు ఉన్నట్లు సీపీ తెలిపారు. చివరి రోజైన బుధవారం 687 మంది హాజరుకాగా 349 మంది అభ్యర్థులు తుది పరీక్షకు హాజరయ్యారు. గతంలో 100 మీటర్లలో 49 మిల్లీసెకండ్లతో అవకాశం చేజారుకున్న మహిళ అభ్యర్థులకు బుధవారం ఈవెంట్స్‌కు అనుమతి ఇవ్వగా 69 మహిళలు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు పేర్కోన్నారు. కాగా కొంత మంది మహిళలు రన్నింగ్‌లో అన్యాయం జరిగిందని స్టేడియం ఎదుట ఆందోళన చేయగా సందేహాలు ఉంటే పోలీస్ నియామక మండలిని సంప్రదించాలని సూచించారు.

ఈవెంట్స్ నిర్వహణలో సిబ్బందికి ధన్యవాదాలు
ఈవెంట్స్ ప్రక్రియ పాల్గొని విజయవంతం చేయడానికి దోహదం చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలన్నారు. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ విధానాన్ని అమలు చేయడంలో సమర్ధవంతంగా పని చేసిన టెక్నికల్ సిబ్బందికి, పీఈటీలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అదనపు ఎస్పీ గిరిధర్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...