తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి


Wed,March 20, 2019 03:03 AM

వరంగల్, నమస్తేతెలగాంణ: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ము ఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మంగళవా రం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ము న్సిపల్ కమిషనర్లతో ఈఎన్‌సీ ధన్‌సింగ్‌తో కలిసి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, హరితహారంపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పైప్‌లైన్లు లేని ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ట్యాంకర్ల ద్వా రా తాగునీటి సరఫరా చేయాలన్నారు. బోర్లు మరమ్మతులు చేపట్టాలని, అలాగే బావులను అద్దెలకు తీసుకొని తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. 100నుం చి 150 మీటర్లకు ఒక చలివేంద్రం ఏర్పాటు చేసేలా చ ర్యలు తీసుకోవాలని వివరించారు. స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు జనసామర్థ్యంగల ప్రాంతాల్లో గ్రీన్ షెడ్స్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

నెల రోజుల్లో నగరాలను క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దాలని అరవింద్ కుమార్ కమిషనర్లకు సూచించారు. ప్రతి రోజు పారిశుధ్య తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుధ్యంపై ప్రజలను చైతన్యపర్చేలా విస్తృత ప్రచారం చేపటాట్టాలని చెప్పారు. ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించబడ్డ వరంగల్ మెరుగైన పారిశుధ్య వ్యవస్థపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వీలిన గ్రామాలపై హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల నుంచి రికార్డులు, డాక్యుమెంట్లను పొందే చర్యలు వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో రానున్న ఏడాదిలో దేశ వాప్తంగా తెలంగాణలోని మున్సిపాలిటీలు 50లోపు ర్యాంకులు సాధించేలా శ్రమించాలని అన్నారు. అమృత్ పథకం అమలు జరుగుతున్న నగరాల్లో రోడ్ల తవ్వకాలను వెంటనే పూడ్చివేసే పనులు చేపట్టాలని అన్నారు. ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అ రవింద్ కుమార్ స్పష్టం చేశారు. వర్టికల్ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ైఫ్లెఓవర్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని ఎక్కువగా ఏర్పాటు చేయాలని చె ప్పారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో కమిషనర్ రవి కిర ణ్, అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎస్‌ఈ భిక్షపతి, సీహెచ్‌వో సునీత, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు, ఈఈ భాస్కర్‌రెడ్డి, బల్దియా ఈఈ రాజ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనాథ్‌రెడ్డి, ఇస్రాత్ జహాన్, శానిటరీ సూపర్‌వైజర్ సుధాకర్, ఆస్కీ ప్రతినిధి రాజ్‌మోహన్, సాంకేతిక నిపుణులు సురేశ్, హరికృష్ణ, పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...