నేత్రాలను దానం చేసిన రమణయ్య


Wed,March 20, 2019 03:03 AM

భీమారం, మార్చి19: మరణానంతరం తన నేత్రాలు మరొకరికి వెలుగు చూపాలనే ప్రగాఢ అకాంక్ష రిటైర్డు అధ్యాపకుడు వెల్దండి రమణయ్యది. సమాజిక సృహతో తనవంతు బాధ్యతగా తన మరణాతరం రెండు నేత్రాలను మరొకరి జీవితంలో వెలుగు నింపేలా వీలునామాలో ముందుగానే దానం ఇవ్వాలని పేరర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ విద్యారణ్యపురిలో నివాసం ఉంటూ మంగళవారం ఉదయం వెల్దండి రమణయ్య(86) తుదిశ్వాస విడిచారు. మందుగా తన వీలునామాలో రాసుకున్న ప్రకారం కుటుంబ సభ్యులు హేమలత, సమలత, శ్రీలత, కరుణ అంగీకారంతో రమణయ్య నేత్రాలను డాక్టర్లు, టెక్నీషియన్స్ సేకరించారు. తెలంగాణ నేత్ర, శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో రమణయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్‌లోని సరోజనీ దేవి కంటి దవాఖానకు తరలించారు. గ్రేటర్ వరంగల్ పరిధి 55వ డివిజన్ చింతగట్టుకు చెందిన వెల్దండి రమణయ్య పదవీ విరమణ అనంతరం 46వ డివిజన్‌లోని విద్యారణ్యపురిలో నివాసం ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో నేత్ర శరీర అవయవ దాతల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కంటి దవాఖాన టెక్నీషియన్ లక్ష్మణ్, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు, రాజమౌళి, తేరాల యుగేందర్, పీ రవీందర్, నర్సింగరావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...