డిగ్రీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల


Wed,March 20, 2019 03:02 AM

-39.6 శాతం ఉత్తీర్ణత
-రీవాల్యుయేషన్‌కు చివరి తేదీ 27..
రెడ్డికాలనీ, మార్చి 19: కాకతీయ యూనివర్సిటీ గత నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 1, 3, 5వ సెమిస ్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరిపాలనా భవనం కమిటీహాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ ప్రొ ఫెసర్ ఆర్ సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం, పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ ఎస్ మహేందర్‌రెడ్డి, డాక్టర్ పీ సదానందం, డాక్టర్ వై వెంకయ్య, ప్రొఫెసర్ వెంకట్రాంరెడ్డి, డాక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్, డాక్టర్ సురేఖ, అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రామా వెం కటేశ్వర్లు ఫలితాలను విడుదల చేశా రు. అన్ని సెమిస్టర్లలో కలిపి మొత్తం 39.6శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించారు. ఉత్తీర్ణతా శాతంలో బాలికలే పైచేయి సాధించారన్నారు. అన్ని సెమిస్టర్లు కలిపి బాలురు 22.4 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలికలు 51.7 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పరీక్షా ఫలితాలను కేయూ వెబ్‌సైట్లు www.kakatiya.ac.in, www.kuexams.org లలో పొందుపర్చామని, విద్యార్థులు మార్కుల వివరాలను పొందవచ్చునని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామా వెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్లు డాక్టర్ ఏ నరేందర్, వీ కృష్ణమాచార్య పాల్గొన్నారు.
దరఖాస్తు ఆన్‌లైన్‌లో..
విద్యార్థులు ఈనెల 27వ తేదీ వరకు రివాల్యువేషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ ఎస్ మహేందర్‌రెడ్డి, డాక్టర్ పీ సదానం దం, డాక్టర్ వై వెంకయ్య తెలిపారు. కేయూ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ ద్వా రా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. సంబంధిత ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చునని తెలిపారు. పేపర్ దరఖాస్తులు అంగీకరించబడవని వారు స్పష్టం చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...