గులాబీ ప్రభంజనం కాంగ్రెస్, బీజేపీలో నైరాశ్యం


Tue,March 19, 2019 03:49 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనాన్ని, సీఎం కేసీఆర్ వ్యూహం ముందు నిలబడి తట్టుకోగలమా? ఇదే కాంగ్రెస్, బీజేపీలకు మిలియన్ డాలర్ల ప్రశ్న. లోన మీమాంస. బయట గంభీరత. ఎటుచూసినా దారీ తెన్నూ కానరాని పరిస్థితి. టీఆర్‌ఎస్ ప్రజాబలం ముందు నిలబడి పరువు తీసుకోవడం ఎందుకు అనే స్థానికీయుల అనుమానం ఒకవైపు, ఇంతకాలం పార్టీలో పనిచేసినా ఇక్కడ తమకు గుర్తింపు రాదనే బెంగ మరోవైపు. అసలు పోటీ చేయకపోతేనే నయం అనే అంతర్నిర్ధాన ఒకవైపు.. ఆ పార్టీల అధిష్టానాల విధానాలకు శ్రేణులు కుదేలవుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు పరాజయం పాలు చేసుడే కాదు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. టీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ ప్రజ ల్లో పెరుగుతున్న ఆదరణచూసి తట్టుకోలేని స్థితికి పార్టీలు వెళ్లిపోయాయి. బీజేపీ పరిస్థితి కొంత నయం. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 38,688 మాత్రమే. భూపాలపల్లి నియోజకవర్గంలో మినహా బీజేపీ అభ్యర్థులకు డిపాజి ట్లు గల్లంతయ్యాయి. కనుక పోటీచేయాలి కాబట్టి పోటీ చేస్తామన్న నిశ్చితాభిప్రాయంతో బీజేపీ ఉంది. ఉమ్మడి జిల్లాలో గెలవడం పక్కనపెడితే ప్రస్తుతం పరిస్థితిలో డిపాజిట్ తెచ్చుకోవడం కష్టంగా మారిందనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నది. ఇటీవల జరిగిన ఎన్నికలను పక్కనపెడితే ఇదే వరంగల్ నియోజకవర్గానికి 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ దక్కని స్థితిని ఆ పార్టీ నేతలు ఉదహరిస్తున్నారు.

పత్తాలేని నాయకులతో పరేషాన్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఏ ఒక్క నాయకుడూ ఈ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో (భూపాలపల్లి మినహా..అది కూడా అప్పుడప్పుడే అన్నట్టు) ప్రజలకు, పార్టీకి అందుబాటులో లేని వాతావరణం నెలకొన్నది. 2015 ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అయితే నేను పుట్టింది ఎక్కడైతే ఏమిటీ? రేపు గెలిచినా ఓడినా ఇక్కడే ఉంట. ఈ వరంగల్ మట్టిలోనే కలిసిపోతా.. అంటూ భారీ డైలాగులు కొట్టి ఎన్నికలు పూర్తికాగానే బ్యాగు గీగు సర్దుకొని జంప్ అయ్యారు. అప్పటి నుంచి పత్తాలేకుండాపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు పత్తా లేకుండాపోయారు. వ రంగల్ తూర్పు నియోజకర్గం నుంచి పోటీచేసిన వద్దిరాజు రవిచంద్ర తన స్వస్థలం ఖమ్మం వెళ్లారు. ఆయన పార్టీ నా యకుడు కాదు, కార్యకర్తా కాదు.

పార్టీతో ఏంపని. వచ్చిం డు. పోటీచేసిండు. వెళ్లిపోయిండు. ఎన్నికల సమయంలో ఇక్కడే ఇల్లుకట్టుకుంట అన్నడు. అయ్యాక ఆయనింటికి ఆయన పోయిండు. అసలు ఆయన ఆ పార్టీలో ఉండే అవకాశం లేదని, త్వరలో పార్టీ మారినా ఆశ్చర్యంలేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వరంగల్ పశ్చిమం నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసిన టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఇప్పుడు ప్రకటించే కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు సహకరిస్తారు. మళ్లీ నాయి ని రాజేందర్‌రెడ్డి సహా ఒకరిద్దరు తప్ప ఇంకెవరున్నరు? ఒకవేళ ఉన్నా అభ్యర్థి ఎవరో వారికి పార్టీకి సంబంధం ఏమిటో అన్నది అనుమానంగానే (మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని వేరే వారికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో) ఉన్నది. వర్ధన్నపేట నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి ఉన్నా.. తనను కాదని పొత్తుల్లో టీజేఎస్‌కు కావాలనే టికెట్ కేటాయించారని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పార్టీకి దూరంగా ఉన్నారని, ఆయనా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే ప్ర చారం జరుగుతున్నది. ఆయనకు అత్యంత సన్నిహితులు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారని, ఈ నేపథ్యంలో ఆయనా పునరాలోచనలో పడ్డారనే ప్రచారం సాగుతున్నది.

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గం నుంచి అసలైన పోటీదారులను కాదని ఇందిరకు అవకాశం ఇచ్చారు. ఆమె ఎన్నికలు కాగానే ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, ఈ పరిస్థితుల్లో అక్కడ ఎవరూ బాధ్యత తీసుకు నే అవకాశాలు లేవని ప్ర చారం జరుగుతున్నది. పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ ఎన్నికలు అయ్యాక ప్రజలకు దూరంగా ఉంటున్నారు. పాలకుర్తి నియోజకర్గం నుం చి పోటీచేసిన జంగా రాఘవరెడ్డి ఏదో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పట్టుకొని జనగామ జిల్లా అధ్యక్షుడిగా తెచ్చుకోగలిగాడు కానీ, ఇదే నియోజకర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ నియోజకర్గంలో అక్కడో ఇక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నా అక్కడ బద్లా తీర్చుకుంటామన్న తీరులో టీఆర్‌ఎస్ కేడర్ పనిచేస్తున్నది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారంతా టీఆర్‌ఎస్‌లో చేరితుండడంతో ఆయన అనుచరుల నుంచి మారుఅనే ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏడింట్లో ఆందోళనకర పరిస్థితే నెలకొన్నదనే, 2015 నాటి ఉప ఎన్నిక కన్నా ఇప్పుడున్న వాతావరణం దృష్ట్యా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలే డీలా పడిపోతున్నారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

కమల విలాపం..
ఏ ఎన్నిక చూసినా ఏమున్నది. అప్పుడెప్పుడో దేశంలో పార్టీ లేని కాలంలో ఇక్కడ ఒక ఎంపీ సీటు సాధించుకున్నవాళ్లం. ఇప్పుడే దేశమంతా తామై ఏలుతున్న పార్టీ అయినా ఇక్కడ ఏం లాభం అన్న నైరాశ్యం బీజేపీని వెంటాడుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిట్లోనూ మా తడాఖా చూపుతాం. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని భీకర ప్రతిజ్ఞలు చేసిన చేయగా, ఒకే ఒక్క భూపాలపల్లిలో మాత్రమే డిపాజిట్ రాగలింది. అది చతుర్ముఖ పోటీ నెలకొనడం, అక్కడ పోటీచేసిన అభ్యర్థి దాదాపు రెండు మూడేళ్ల నుంచి అక్కడే తాను పోటీచేస్తానని గ్రౌండ్ వర్క్ చేసుకోవడంతో డిపాజిట్ దక్కిందని కమలనాథుల విశ్లేషణ. ఏడు నియోజకర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 38,688.

ఇందులో 15,744 ఓట్లు భూపాలపల్లివే కావడం విశేషం. ఇందులో 5 వేల నుంచి ఆరువేల దాకా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు కేవలం రెండంటే రెండే అంటే మిగితా నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అంచనా వేసుకోవచ్చు. ఏదో పోటీచేయాలి కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి, కనీసం ప్రధాని నరేంద్రమోడీ పేరునైనా జపించవలె కాబట్టి పోటీచేయాల్సిన పరిస్థితి ఉందని ఆ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులే పేర్కొనడాన్ని బట్టి చూస్తే యుద్ధానికి ముందే కత్తి పడేసిన చందంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కున్న ప్రజాబలం, అంతకన్నా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తట్టుకొని నిలబడి కలెబడేంత సీన్ ఉందా అని రెండు జాతీయ పార్టీ నాయకుల్లో నెలకొన్న నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...