బల్దియాకు నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్


Tue,March 19, 2019 03:47 AM

-అర్బన్ అథారిటీ అవార్డు
వరంగల్, నమస్తే తెలంగాణ: మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని సమర్థవంతగా నిర్వహిస్తున్నందుకుగాను నే షనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అథారిటీ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు అవార్డును అందజేసింది. నాన్ నెట్ వర్క్ భారతదేశ పారిశుధ్య పరిస్థితులపై గత ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరిగిన వర్క్‌షాపులో నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అథారిటీ వరంగల్ కార్పొరేషన్‌కు అవార్డును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్ కార్పొరేషన్‌కు మాత్రమే ఈ అవార్డు వచ్చింది. ఈ మేరకు అవార్డులు, ప్రశంసా పత్రాలను ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి సోమవారం కమిషనర్ రవికిరణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ మానవ వ్యర్థాల శుద్ధికేంద్రం దేశంలోనే మొదటగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్నామని వివరించారు. పబ్లిక్ టాయ్‌లెట్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్ల నిర్వహణ బాగుందన్న ప్రశంసలు వర్క్ షాపులో వచ్చాయని రవికిరణ్ అన్నారు. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిహంచడంతో పాటు మలాన్ని శుద్ధిచేసి ఎరువుగా మార్చే విధానం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కమిషనర్ అన్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన ఎంహెచ్‌వో రాజారెడ్డిని అభినందించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...