ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలి


Tue,March 19, 2019 03:47 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 18: ఎన్నికల ప్రణాళిక ప్రకారం రోజువారీ ఏర్పాట్లను పూర్తి చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రణాళిక అమలుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మొదటి విడుత శిక్షణను ఈ నెల 24వ తేదీలోపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పూర్తి చేయాలన్నారు. రెండో విడుత శిక్షణను ఈ నెల 31, ఏప్రిల్ 1వ తేదీల్లో నిర్వహించాలని సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఈ నెల 26, 27 తేదీల్లో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో చునావ్‌పాఠశాల నిర్వహించాలన్నారు. ఉద్యోగుల డ్యూటీ సర్టిఫికెట్లు, పోస్టల్ బ్యాలెట్లు పంపిణీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలన్నారు.

మైక్రో అబ్జర్వర్ల నియామకం, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీలకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్, సఖీమహిళా, దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ ముద్రణను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ దయానంద్, ట్రైనీ కలెక్టర్లు సంతోష్, మెప్మా పీడీ కృష్ణవేణి, ఎన్‌ఐసీ డీఐవో విజయ్‌కుమార్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీధర్, స్టేషన్‌ఘన్‌పుర్ ఏఆర్‌వో ఎల్ రమేశ్, పాలకుర్తి ఏఆర్వో ఎం మాలతి, పరకాల ఏఆర్వో ఎస్ కిషన్, వరంగల్ తూర్పు ఏఆర్వో రవికిరణ్, వర్ధన్నపేట ఏఆర్వో సీహెచ్ మహేందర్‌జీ, భూపాలపల్లి ఏఆర్వో ఈ వెంకటాచారి, జిల్లా సహాయ వ్య య పరిశీలకుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి, సి-విజిల్ నోడల్ అధికారి ఎం శ్రీను, జిల్లా యువసేన సంక్షేమాధికారి ధనలక్ష్మి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు కిరణ్‌ప్రకాశ్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...