పూల రవీందర్ విస్తృత ప్రచారం


Tue,March 19, 2019 03:47 AM

న్యూశాయంపేట: నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి టీఆర్‌ఎస్ మద్దతిస్తున్న అభ్యర్థి పూల రవీందర్ సోమవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ, సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్, వడ్డెపల్లిలోని పింగిళి కళాశాలలో, కాకతీయ యూనివర్సిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆధ్యాపకులను, ఆచార్యులను రవీందర్ అ భ్యర్థించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడు తూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయడంలో, కాంట్రాక్ట్ లెక్చర్లకు జీతంతో కూడిన సెలవులు మం జూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతుల అందే విధంగా ప్రయత్నిస్తానని అన్నా రు. పదవీ విరమణ వయస్సు 61సంవత్సరాల వరకు ఉండేలా జీవో సాధించడానికి కృషిచేస్తానన్నారు. జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని స్పష్టంచేశారు.

ఆరు సంవత్సరాల్లో అనేక ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించానని, ఇంకా సమస్యలు ఉన్నాయని ఒక్కొక్కటిగా మీ అందరి సహాకారంతో పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగంపై పత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించేందుకు ప్ర త్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతనే ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత పెరిగిన విషయం విమర్శకులు గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో పూల రవీందర్‌ను గెల్పించి పీఆర్టీయూ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్య జాక్ నాయకులు పులి సారంగపాణి, సంజీవయ్య, బాబురావు, శ్రీణివాస్‌రెడ్డి, వాసం శ్రీనివాస్ పాల్గొన్నారు.

రవీందర్ సతీమణి ప్రచారం ..
ఎమ్మెల్సీ అభ్యర్థి శాసన మండలి సభ్యుడు పూల రవీందర్ గెలుపు కోసం ఆయన సతిమణి పూల విజయలక్ష్మి సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వంచనగిరి, మల్లంపల్లి, నల్లబెల్లి, కొత్తగూడ, చెన్నారావుపేట పాఠశాలల్లో, నెక్కొండ మండంలోని కేజీబీవీ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన భర్త పూల రవీందర్‌కు మొదటి ప్రాధాన్యాత ఓటు వేసి గెలిపించాలని ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను అభ్యర్థించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ముందుండి పోరాడిన వ్యక్తి రవీందర్ అని తెలపారు. భవిష్యత్‌లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయుల సమస్యల సాధనకు మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు మరుపాక రమేశ్, మేచినేని సరిత, అరుణ, సుజాత పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...