విదేశీ సంబంధాలపై విశేష కృషి


Tue,March 19, 2019 03:46 AM

- భారత మాజీ రాయబారి వీపీ హరన్
నిట్‌క్యాంపస్, మార్చి18 : భారతదేశం పొరుగుదేశాలతో రాజకీయ, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి విశేష కృషి చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున పనిచేస్తున్న భారత మాజీ రాయబారి వీపీ హరన్ తెలిపారు. భారతీయ యువత విదేశాలకు వెళ్లకుండా వారి సేవలను ఇక్కడే వినియోగించుకునే అంశంపై కూడా సీరియస్‌గా ప్ర యత్నిస్తున్నదని స్పష్టం చేశారు. నిట్‌లో నిర్వహిస్తున్న ప్రముఖుల ప్రసంగం కార్యక్రమంలో భాగంగా హరన్ సోమవారం సాయంత్రం అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో భారత విదేశాంగ విధానం-సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. భూటాన్, సిరియా దేశాల్లో భారత రాయబారిగా, సార్క్ సంబంధాల్లో భాగంగా గల్ఫ్ దేశాలు, అమెరికాతో విదేశీ సంబంధాలు నెలకొల్పిన అనుభవం ఉన్న హరన్ మాట్లాడుతూ రెండో ప్రపంచయుద్ధం తర్వాత విదేశాలతో రాజకీయ, ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. గల్ఫ్ దేశాలు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాలతో సఖ్యత కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీఎఫ్‌వో అక్బర్, కేవీ జయకుమార్, రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు, స్టుడెంట్ వెల్ఫేర్ డీన్ ఎల్‌ఆర్‌జీ రెడ్డి, నిట్ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...