నీటిఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక


Tue,March 19, 2019 03:45 AM

వరంగల్, నమస్తే తెలంగాణ : నగరం లీకేజీల మయం అయ్యింది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకు పోయేందుకు గ్రేటర్ అధికారులు అడుగులు వేస్తున్నారు. తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందలకు కారణంగా నిలుస్తున్న పైప్‌లైన్ లీకేజీలపై గ్రేటర్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్‌లలో సుమారు 400 లీకేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటని సత్వరమే మరమ్మతులు చేపట్టాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ రూపోందిస్తున్నారు. గ్రేటర్‌లోని లీకేజీల మరమ్మతులను వెంటనే చేపట్టాలని కమిషనర్ రవికిరణ్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. ఇప్పటికే గ్రేటర్ అధికారులు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. లీకేజీల మరమ్మతులు, ఆదనపు ట్యాంకర్లు, బోర్ల మరమ్మతు, విలీన గ్రామాల్లో బావుల పూడిక తీతలు, అద్దెలు ప్రధాన ఎజెండాగా రూపొందించారు. ఇందుకోసం రూ.4.45 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ వేసవిలో ఎండలు మండుతున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలకు గ్రేటర్ అధికారులు శ్రీకారం చుట్టారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...