ఆలయానికి పోటెత్తిన భక్తులు


Mon,March 18, 2019 03:08 AM

ఐనవోలు మార్చి17: ఐనవోలు మల్లికార్జునస్వామి వారాంతపు జాతరలో భాగంగా దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. స్వామి వారికి ఒగ్గు పూజారులు మేలుకొలుపు తర్వాత ఉదయం 6గంటల నుంచే స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు స్వామి విశేష అభిషేకాలు, కల్యాణం నిర్వహించి రుద్రాభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పట్నాలు వేసి బోనం వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యం, వస్ర్తాలు, ముత్తైదు సామగ్రిని ముట్టచెప్పారు. మరికొందరు రథ సేవను నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఈవో నాగేశ్వర్‌రావు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
అన్నదాన కార్యక్రమం
మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. దేవస్థా నం ప్రాంగణంలోని సత్రాల్లో ఆర్యవైశ్య, శాలివాహన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యం లో అన్నదానం చేశారు. దీనికి ట్రస్టు నిర్వాహకులు పబ్బతి సంపత్‌కుమార్, అమరవాది సారంగపాణి హాజరయ్యారు. కార్యక్రమంలో బైరి రాధిక, వెంకటేశ్వర్లు, శ్యాం, బైరి వేణు, సుద్రాల బాబు, సాంబయ్య, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...