పాల్గొన్న ఆచార్య బన్న అయిలయ్య


Mon,March 18, 2019 03:08 AM

రెడ్డికాలనీ, మార్చి 17: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య స్మృతి కావ్యం అశ్రుభోగ పుస్తకాన్ని హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్రాభాషా నిలయంలో ఆదివారం ఆవిష్కరించారు. సభాధ్యక్షుడు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు గిరిజా మనోహర్‌బాబు, సాహితీవేత్త శివరామప్రసాద్ ప్రముఖ పాత్రికేయులు, రచయిత కస్తూరి మురళీకృష్ణ, రచయితలు రామచంద్రమౌళి, డాక్టర్ లంకా శివరామప్రసాద్, కవులు వీఆర్ విద్యార్థి, డాక్టర్ దేవులపల్లి శ్రీవాణి, శ్రీలత, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ గడిచిన పన్నెండు సంత్సరాల్లో తన జీవితంలో ఎడతెగకుండా మృత్యుఘాతం తగులుతూనే వచ్చిందని, ఆ మృత్యువు తనను చెదిరించలేకూపోయిందని అన్నారు. మౌలికంగా తనలో ఉన్న శాంతిని అనుభవ కేంద్రంలోనే నిలిపి ఉంచిందని, దాని ఒత్తిడి అశ్రుభోగ క్యావంగా వెలువడించానని, అశ్రువులు బయటకు వ్యక్తీకరపించబడేదని అన్నారు. బోగము మనస్సు అనుభవించే అంశమన్నారు. మృత్యువుకు సంబంధించి పాజిటివ్‌గా రాశారన్నారు. 83 సంవత్సరంలో తన జన్మదిన సందర్భంగా అశ్రుభోగ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు. ఆచార్య బన్నా అయిలయ్య మాట్లాడుతూ కోవెల సుప్రసన్నాచార్య కలాలను ప్రభావితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సంతోష్, అరసం నేత, కవులు బిల్లా మహేందర్, కవులు, సహతీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...