స్వచ్ఛమైన తాగునీరు ఆరోగ్యానికి మేలు


Mon,March 18, 2019 03:08 AM

-ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు
ఐనవోలు మార్చి 17 : శుద్ధ్దమైన తాగు నీరు.. ఆరోగ్యానికి మేలు అని ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాట్‌ను సర్పంచ్ జన్ను కుమారస్వామిలతో కలిసి ఆయన పునర్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా శుద్ధ్దిచేసిన నీటిని కొనుక్కొని తాగాలంటే ఎక్కువ ధర చెల్లించవాల్సి వస్తుందని ప్రజలందరూ శుద్ధ్ది చేసిన నీరు తాగలేకపోతున్నారన్నారు. ప్రజలకు తక్కువ ధరకు నీరు అందించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన 20 లీటర్ల నీరు కేవలం రూ.3 అందించడం అభినందనీయం అన్నారు.ఏటీడబ్ల్యూ కార్డు పద్దతి ద్వారా నీరు అందిస్తున్నారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఉప సర్పంచ్ అడ్డగూడి సతీశ్‌కుమార్, వార్డు మెంబర్లు లలిత, మహేందర్, పూల, సుజాత, శాంత, సౌందర్య, అశోక్, రమేశ్, సమ్మయ్య, శ్రీను, రాములు, రజిత, మమత టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్, కారోబార్ షబ్బీర్, నాయకులు బాబు, గణేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...