వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు


Mon,March 18, 2019 03:07 AM

-హాజరైన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
-స్వామివారి రాకతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం
సిద్ధార్థనగర్, మార్చి 17: 51వ డివిజన్ చైతన్యపురి కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఘనంగాజరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభం కాగా ఉదయం 9 గంటలకు ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హాజరై స్వామిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు ఆయనను ఆశీర్వదించగా ఆలయ కమిటీ వారు స్వామి వారి శేషవస్ర్తాలు, ఆలయ జ్ఞాపికతో సత్కరించారు.
ప్రతి ఇంటా పండుగే..
సాయంత్రం యాగశాల వద్ద పూజల అనంతరం నూతన దంపతులైన స్వామి వారిని పద్మావతి, గోదా సమేతంగా గరుడవాహనము మీద చైతన్యపురి కాలనీ విధుల్లో మేళ తాళాలతో ఊరేగింపు చేశారు. స్వామి రాక సందర్భంగా కాలనీ మహిళలు వారి ఇళ్ల ఎదుట ముగ్గులతో అలంకరించి కుటుంబ సమేతముగా స్వామిని మంగళహారతులతో ఆహ్వానించి కానుకలు సమర్పించారు. పసుపు వస్ర్తాలు ధరించిన భక్తులు స్వామి ఊరేగింపు ముందు కోలాటాలు ఆడుతూ, కీర్తనలు పాడుతూ వేడుకగా సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ టీకే శ్రీనివాసాచార్యులు, కమిటీ సభ్యులు పంజాల అశోక్‌కుమార్, కెప్టెన్ వడ్డెపల్లి నరేందర్, వెంకటమల్లారెడ్డి, గంపా శంకరయ్య, దిలీప్‌కుమార్, సుజాత, మధులత, రవిచంద్ర, వెంకటేశ్వర్లు, రాజన్న, సమ్మయ్య, రవి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, సత్యనారాయణరెడ్డి, రవీందర్, రాజమోహాన్, భక్తులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...