ఎంపీ అభ్యర్థుల ప్రచారం వ్యయం రూ.70 లక్షలు


Sun,March 17, 2019 03:58 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 16: లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం వ్యయం గరిష్టంగా రూ.70 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి, అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 99-స్టేషన్‌ఘన్‌పుర్, 100-పాలకుర్తి, 104- పరకాల, 105- వరంగల్ పశ్చిమ, 106-వరంగల్ తూర్పు, 107-వర్ధన్నపేట, 108- భూపాల్‌పల్లి శాసనసభ స్థానాల సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంట్స్ టీంలు, వీడియో సర్వేలెన్స్ టీంలు, వీడియో వీవింగ్ టీంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పీజే పాటిల్ మాట్లాడుతూ సహాయ వ్యయ పరిశీలకుల పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేయాలని స్పష్టం చేశారు.

పనిచేయని అధికారులను ఎన్నికల నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. శాఖాపరమైన పనుల సాకుతో ఎన్నికల విధులకు ఇబ్బంది కల్గించరాదన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సస్పెండ్ అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవడం కష్టం అని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరుకాని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాసనసభ స్థాయిలో నియమించిన సహాయ వ్యయ పరిశీ లకుల బృందాలను సమన్వయపరిచేందుకు జిల్లా స్థాయిలో ఏఈవోగా వి.విజయ్‌భాస్కర్‌రెడ్డిని, జిల్లా స్థాయి అకౌంట్స్ ఆఫీసర్‌గా వాల్యానాయక్‌ను నియమించినట్లు తెలిపారు.

పార్టీల ప్రతినిధుల అభిప్రాయాల మేరకు ధరల నిర్ణయం
అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చులను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకొని ధరల చార్ట్‌ను రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. దయానంద్ తెలిపారు. ప్రచారానికి సం బంధించి ప్రతీ కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని వీడియో సర్వేలెన్స్ టీంలను ఆదేశించారు. ఆ వీడియోలను పూర్తిగా పరిశీలించాలని వీడియో వీవింగ్ టీంలకు సూచించారు. సాక్షాలతో ప్రచార ఖర్చులు నమోదు చేయాలన్నారు. శాసనసభ సహాయ వ్యయ పరిశీలకులకు చార్ట్ ప్రకారం ప్రచార ఖర్చుల వివరాలను ప్రతి రోజు అందించాలన్నారు. అన్ని బృందాలు ప్రచార ఖర్చుల నివేదికలను ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. సం బంధిత రికార్డులను, సాక్షాలను భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచాలన్నారు. ఈ సందర్బంగా రోజు వారి నివేదికలను గురించి వివరించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...