ప్రపంచానికి కాకతీయ వారసత్వం


Sun,March 17, 2019 03:57 AM

-నేటి నుంచి నాలుగు రోజులపాటు హరితలో ఫొటో సదస్సు
-దేశం నలుమూల నుంచి ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ల రాక
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కాకతీయ వారసత్వ సంపదను ప్రపంచానికి వినూత్నంగా పరిచయం చేయడంలో భాగంగా తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ నేటి నుంచి నాలుగు రోజుల పాటు నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సును కలెక్టర్ ప్రశాం త్ జీవన పాటిల్ ప్రారంభిస్తారని తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ డైరెక్టర్ కొమ్మిడి విశ్వేందర్‌రెడ్డి తెలిపారు. కాకతీయ వారసత్వ ఘనకీర్తిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాకతీయ కట్టడాలు, గుడులు, నిర్మాణ శైలీరీతుల్ని చిత్రికపట్టేందుకు ఇప్పటికే ఈ రంగంలో కృషి చేసిన వారితోపాటు దేశ నలుమూలల నుంచి 100మంది నిష్ణాతులైన ఫొటోగ్రాఫర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. 18న రామప్పలో, 19న ఖిలావరంగల్‌లో ఈ ఫొటోగ్రాఫర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫొటోలు తీస్తారు. వరంగల్‌కు చెందిన కుసుమ ప్రభాకర్, మధుగోపాల్, అరవింద్ ఆర్య పకిడే వారు తీసిన ఫొటో ప్రదర్శనతోపాటు నాలుగు రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొని తీసే అపురూపమైన ఫొటోలు తీసిన వారికి బంగారు, వెండి, రజత పతకాలను బహూకరించడమే కాకుండా ఈ సదస్సు అనంతరం తమ సంస్థ కాఫీటేబుల్ బుక్‌ను తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా టూరింగ్ ఎగ్జిబిషన్ పేరు మీద ప్రపంచంలో ని ప్రఖ్యాతి గాంచిన నగరాల్లో ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నా రు. తొలి రోజు సదస్సు ప్రారంభం అనంతర ం 18, 19 తేదీల్లో వీక్షకుల కోసం ఫొటో ప్రదర్శ న ఉంటుదని ఆయన పేర్కొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...