ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి


Sun,March 17, 2019 03:57 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 16 : నిబంధనలను ఆర్థం చేసుకుని విధుల సక్రమంగా నిర్వర్తించాలని సెక్టోరియల్ అధికారులను వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో సెక్టోరియల్ అధికారులకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలలో కల్పించాల్సిన మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. ఎక్కడైనా వసతుల కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు బాగా పనిచేశారని ఈ సందర్భంగా అభినందించారు. ఏప్రిల్ 1వతేదీ నుంచి 4వ తేదీలోగా ఈవీఎంల కమిషనింగ్ ఉంటుందని, డిస్ట్రిబ్యూషన్ రోజు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఈవీఎంలు పోలింగ్ పర్సన్స్ సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్‌రోజు నిర్ధేశించిన మార్గంలో ప్రయాణిస్తూ ప్రిసైడింగ్ అధికారులతో పోలింగ్‌తీరును మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా పోలింగ్‌కు సాంకేతిక సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించి ఈవీఎంల రిప్లేస్‌మెంట్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయిం ట్ కలెక్టర్ ఎస్ దయానంద్, వరంగరల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట ఏఆర్వోలు ఎన్ రవికిరణ్, కే వెంకారెడ్డి, మహేందర్‌జీ, కలెక్టరేట్ ఎన్నిక ల విభాగం పర్యవేక్షకుడు కిరణ్‌ప్రకాశ్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...