వినియోగదారులకు అందుబాటులో ఉండాలి


Sun,March 17, 2019 03:57 AM

-డీఈలు మండలాల్లో ఉండకపోతే చర్యలు తప్పవు
-సీఎండీ ఏ గోపాల్‌రావు
ఖమ్మం కమాన్‌బజార్, మార్చి 16: విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించాలని సీఎండీ అన్నమనేని గోపాల్ రావు, ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌పీడీసీఎల్ గెస్ట్‌హౌస్‌లో రెండు జిల్లాల విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా వాటిల్లుతున్నాయని దీని వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొవడం దాంతోపాటు సమస్తకు నష్టం వాటిలే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. అంతరాయాలు ఏర్పడినప్పుడు అక్కడ పనిచేస్తున్న డీఈలు మండలాల్లో అందుబాటులో ఉండకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల్లో పనిచేసిన ఏఈలు సరైన బాధ్యతరహితంగా పనిచేయకపోవడంతో చాలా మండలలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాంటి వాటిని గతంలో పనిచేసిన ఏఈలు ఆ సమస్యలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో అక్కడ పనిచేస్తున్న ఏఈలకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం వారం రోజుల్లో అమలుకాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏఈలు, ఏడీఈల పనితీరును మార్చుకోపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా విద్యుత్ ఆదాయం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌ఈలు రమేశ్, సురేందర్, డీఈలు తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...