వరంగల్ మార్కెట్ కమిటీ ఆదాయం రూ.16కోట్ల 20లక్షలు


Sun,March 17, 2019 03:57 AM

కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆదాయం ఈ ఏడాది రూ.16కోట్ల 20లక్షల 40వేలకు చేరుకుంది. 2017-18కి గాను రూ.27కోట్ల టార్గెట్ ఉండగా పత్తి దిగుబడి తగ్గడంతో ఈ సంవత్సరం చాలా వరకు ఆదాయం తగ్గినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం వరంగల్ మార్కెట్ టార్గెట్ రూ.27కోట్లకు గాను రూ.22కోట్ల 30లక్షలు వసూలయ్యాయి. అలాగే ములుగు జిల్లా మార్కెట్ అదాయం మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం టార్గెట్ రూ.3కోట్ల 70లక్షలకు గాను రూ.3కోట్ల 83లక్షల 33వేలు వసూలయ్యాయి. గత సంవత్సరం రూ.3కోట్ల 37లక్షలకు గాను రూ.3కోట్ల 41లక్షలు వసూలయ్యాయి. అలాగే భూపాల్‌పల్లి జిల్లా కాటారం మార్కెట్ ఆదాయం టార్గెట్ రూ.కోటి 70లక్షలు గాను రూ.కోటి 4లక్షల 22వేలు వసూలయ్యాయి. గత సంవత్సరం టార్గెట్ రూ.85లక్షలకు గాను రూ.కోటి 66లక్షలు వసూలయ్యాయి. అలాగే వరంగల్‌రూరల్ జిల్లా మార్కెట్ల ఆదాయం టార్గెట్ రూ.9కోట్ల 90లక్షలకు గాను రూ.6కోట్ల 17లక్షల 96వేలు వసూలయ్యాయి. గత సంవత్సరం రూ.8కోట్ల 82లక్షలకు గాను రూ.9కోట్ల 9లక్షలు వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. మహబూబ్‌బాద్ జిల్లా మార్కెట్ కమిటీల టార్గెట్ రూ.8కోట్ల 40లక్షలకు గాను రూ.5కోట్ల 19లక్షల 45వేలు వసూలైనట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రూ.8కోట్ల 14లక్షలకు గాను రూ.7కోట్ల 17లక్షలు వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. జనగామ జిల్లా మార్కెట్ కమిటీల టార్గెట్ రూ.6కోట్ల 95వేలకు గాను రూ.3కోట్ల 67లక్షల 19వేలు వసూలయ్యాయి. గత సంవత్సరం రూ.5కోట్ల72లక్షలకు గాను రూ.6కోట్ల 95లక్షలు వసూలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మార్కెట్ల ఆదాయం రూ.57కోట్ల 65లక్షలకు గాను రూ.36కోట్ల 12లక్షల 55వేలు ఫిబ్రవరి వరకు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రూ.53వేల కోట్ల 90లక్షలకు గాను రూ.49కోట్ల, 96లక్షల, 96వేలు వసూలైనట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...