రైల్వేస్టేషన్‌లో రూ.30లక్షలు పట్టివేత


Sun,March 17, 2019 03:57 AM

-నగదు కోర్టుకు అప్పగింత
-వివరాలు వెల్లడించినరైల్వే సీఐ వినయ్‌కుమార్
ఖిలావరంగల్, మార్చి 16 : వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి వద్ద రైల్వే పోలీసులు శనివారం రూ.30లక్షలు పట్టుకున్నారు. వరంగల్ రైల్వే సీఐ వీ వినయ్‌కుమార్ కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన వ్యాపారి సంపత్‌కుమార్ (62) వరంగల్ రైల్వేస్టేషన్‌లోని రెండో నంబరు ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా డబ్బులు కనిపించాయి. వాటికి సంబంధించిన ఎలాంటి రశీదు లేకపోవడంతో వ్యాపారిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించాం. ఈ విచారణలో మొత్తం డబ్బులు రూ.30లక్షలు నగదును గుర్తించాం. అయితే వ్యాపారి మాత్రం ఎలాంటి రశీదులు చూపట్టలేదు. తన స్నేహితుడి కూతురి వివాహానికి, వ్యాపారంలో భాగంగా సరుకులు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు వెళుతున్నట్లు తెలిపారు. అయితే డబ్బులకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై పరశురాములు, హెడ్‌కానిస్టేబుల్ సమ్మిరెడ్డి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...