మనస్తతత్వాలపై పరిశోధనలు జరగాలి


Sun,March 17, 2019 03:56 AM

రెడ్డికాలనీ, మార్చి16: విశ్వవిద్యాలయాల్లో మనస్తతత్వాలపై పరిశోధనలు జరిగినప్పుడు మెరుగైన సమాజ నిర్మాణానికి అవకాశం ఉంటుందని కేయూ వీసీ ఆర్ సాయన్న అన్నారు. కేయూ సైకాలజీ విభాగం, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ సెనెట్‌హాల్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రమోటింగ్ పాజిటివ్ సైకాలజీ, మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్-ఛాలెంజెస్ అండ్ అప్రచున్యూటిస్ అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి దూరవిద్యా కేంద్ర సంచాలకుడు జీ వీరన్న అధ్యక్షత వహించగా.. వీసీ సాయన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో కలుగుతున్న ఒత్తిడి, సమస్యలు, హింసాత్మక వైఖరి, కుటుంబ కలహాలు, వ్యక్తుల మధ్య విభేదాలు, వ్యవస్థాగతమైన అడ్డంకులకు పరిష్కారం కేవలం పాజిటివ్ సైకాలజీతోనే సాధ్యమన్నారు. గౌరవఅతిథులుగా హాజరైన ప్రొఫెసర్ ఎస్ గౌతం గావాలి మాట్లాడుతూ..

యువతకు పాజిటివ్ సైకాలజీతో పాటు నైపుణ్యాల అభివృద్ధిని జోడించినప్పుడే విద్యార్థుల్లో సామర్థ్యం, విశ్వాసం, వ్యక్తిత్వం పెంపొందుతుందన్నారు. గౌరవ అతిథులుగా హైదరాబాద్‌కు చెందిన క్లీనికల్ సైకాలజిస్ట్ ఆచార్య కే నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సైకాలజీ పరిధి చాలా తక్కువతో మొదలైంది కావున ప్రస్తుత తరుణంలో దాని పరిధిని విస్తరింపజేయాలని కోరారు. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎంవీఆర్ రాజు, డీన్ సోషల్ సైన్సెస్ టీ రమేశ్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టీ రవీందర్‌రెడ్డి, దూరవిద్య కేంద్రసంచాలకులు వీరన్న మాట్లాడుతూ.. పాజిటివ్ సైకాలజీ, సామాజిక శాస్ర్తాల అనుసంధానం తద్వారా ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లాడారు. సెమినార్ కన్వీనర్, విభాగాధిపతి వీ రామచంద్రం రెండు రోజుల జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం, పత్రాల సమర్పణ గురించి వివరించారు. ఆచార్య టీ శ్రీనివాసరావు, డాక్టర్ రాజు, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...