పది పరీక్షలు ఆరంభం


Sun,March 17, 2019 03:56 AM

-తొలి రోజు 26 మంది గైర్హాజరు
-16,371 మంది విద్యార్థులు హాజరు
-పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్
-సెంటర్ల బయట తల్లిదండ్రుల సందడి
న్యూశాయంపేట, మార్చి 16: వరంగల్ అర్బన్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు శనివారం సజావుగా జరిగాయి. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేయగా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సెంటర్ చుట్టూ ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఇదిలా ఉంటే పరీక్షల సందర్భంగా గతేడాది ఉచిత బస్సులు నడిపిన ఆర్టీసీ ఈ సంవత్సరం బస్సులు ఏర్పాటు చేసింది కానీ ఉచిత ప్రయాణం అందించకలేకపోయింది.
16,371 మంది విద్యార్థుల హాజరు
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు 16,397మందికి 16,371మంది పరీక్షకు హాజరయ్యారు. 26 మంది గైర్హాజరయ్యారు. 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం 9 గంటలోపే దాదాపు విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

నంబర్లు చూసేందుకు ఇబ్బందులు
పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హాల్‌టికెట్ నంబర్లకు సంబంధించి బోర్డు ఒకే చోట ఏర్పాటు చేయడంతో చూసుకోవడానికి విద్యార్థులు కొంత ఇబ్బందులు పడ్డారు. నంబర్ బోర్డులను ఎక్కువగా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.
పరీక్ష కేంద్రాలను సందర్శించిన డీఈవో
జిల్లా పరిధిలో ఎలాం టి అవతకవకలు జరగ కుండా డీఈవో నారా యణరెడ్డి పలు పాఠశాలల్లోని కేంద్రాలను పర్యవేక్షించారు. ైఫ్లెయింగ్ స్కా డ్ బృందాలు 32, రాష్ట్ర పరిశీలకులు 6 మొత్తం 42 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిం చారు. టీఎస్‌ఎమ్మెస్ ఎల్కతుర్తి పరీక్షా కేంద్రం లో బాలరాజు ఇన్విజిలేట ర్ విధుల్లో ని ర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడిని పరీక్షల విధుల నుం చి తొలగించారు. పరీక్షలో ఎలాంటి అవకతవ కలు జరగలేదు, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

తొలుత ఆందోళన
తొలిసారి పరీక్షలను ఎదుర్కొంటున్న పదో తరగతి విద్యార్థులు కేంద్రాలకు చేరుకునే వరకు ఏదో తెలియని ఆందోళన, ఒకింత భయం వెంటాడాయి. విద్యాశాఖాధికారుల సూచనలతో కేంద్రంలోని వెళ్లిన విద్యార్థులకు ఇన్విజిలేటర్లు తమ అనుభవాలతో జవాబు పత్రాలపై వేయాల్సిన నంబర్లను, ప్రశ్నాపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రోత్సహించడంతో విద్యార్థుల్లోని భయం తొలగిపోయింది. తొలి రోజు శనివారం పరీక్షా కేంద్రాల్లోకి భయంతో తమ తల్లిదండ్రులు, పెద్దల సహాయంతో వెళ్లిన విద్యార్థులు పరీక్ష ముగిసిన అనంతరం చిరునవ్వుతో రావడం కనిపించింది. ఇదే స్ఫూర్తితో అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తామన్న ధీమా విద్యార్థుల్లో కలిగింది.
మొదటి రోజు ప్రశాంతం : డీఈవో
జిల్లాలో 79 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటిలో 77 కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు, రెండు ప్రైవేటు విద్యార్థులకు కేటాయించాం. 79 పరీక్షా కేంద్రాల్లో 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాం.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...