లోక్‌సభ ఎన్నికల్లో వార్ వన్‌సైడే..గులాబీ జోష్..!


Sat,March 16, 2019 01:49 AM

- విజ్ఞత ఉన్నవాళ్లంతా టీఆర్‌ఎస్‌లోకి..
- తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది..
- వరంగల్ లోక్‌సభ స్థానంలో ఐదు లక్షల మెజార్టీ సాధిస్తాం
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెంగాణ, మార్చి 15 : పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో వార్ వన్‌సైడ్‌గా అన్నట్లుగా జరగనున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, తెంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఒక ఆలోచన వచ్చిందని, విజ్ఞత ఉన్నవాళ్లు, తెలంగాణ బాగు పడాలనుకునేటోళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు తెలిపాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ.. కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేలా తయారు కావాలని ఇలా అయితేనే తెలంగాణ బాగుపడుతుందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా కోరుకుంటున్నారని ఈ తరుణంలో పార్టీలు మారుతున్న కొంత మందిపై ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడం నవ్వు తెప్పిస్తోందన్నారు. కేంద్రంలో అణు ఒప్పంద సమయంలో ప్రభుత్వ తీర్మాణం వీగిపోకుండా కాంగ్రెస్ నేతలు టీడీపీ ఎంపీలను ఎందుకు కొన్నారు? స్వరాష్ట్ర కాంక్షతో ప్రజల అభీష్టానికి తగినట్టు పోరాటం చేసి టీఆర్‌ఎస్ పక్షాన విజయం సాధించిన ఎమ్మెల్యేలను నాడు కాంగ్రెస్‌లోకి ఎందుకు తీసుకున్నారు?, పార్లమెంట్ వ్యవస్థలో యూపీఏ హయాంలో క్రాస్‌ఓటింగ్‌లు జరిగిన వ్యవహారాలకు ఉసిగొల్పిన కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి ప్రశ్నించారు.

ఈ రోజు టీఆర్‌ఎస్‌లోకి వచ్చేవారంత రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారని గుర్తుచేశారు. దేశంలో ఒక పార్టీ సింగిల్‌గా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని అనేక సర్వేలు వెల్లడించాయన్నారు. ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో బీజీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కించుకునే అవకాశాలు లేవని చెప్పారు. ప్రజలంతా ఏకమై 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు అందిస్తే కేసీఆర్ మద్దతు తెలిపిన వారే ప్రధాని అవుతారని అన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, దేవాదుల, మిషన్ భగీరథ వంటి పథకాలు పూర్తి కావాలంటే కేంద్రం నుంచి నిధులు అవసరమని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విన్నపాలను పట్టంచుకోలేదని కావాల్సిన నిధులు ఇవ్వలేదని అనేక విషయాల్లో మొండిచేయి చూపిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో మాత్రం ఒక ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చలేదని ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్‌కు అందించాలని పిలుపునిచ్చారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న పథకాలు దేశంలోనే అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని చెప్పారు.

భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులంతా సమాయత్తం కావాలని మంత్రి ఎర్రబెల్లి న్నారు. వరంగల్ పార్లమెంట్‌లో 5లక్షలు, మహబూబాబాద్ పార్లమెంట్‌లో 2లక్షల ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికంగా ముందుకు వెళ్తున్నామని, అన్ని పార్టీల మద్దతు తీసుకుని మెజార్టీ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీని అందించేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామని, ప్రజలందరి సహకారంతో ఈ టార్గెట్‌ను చేరుకుంటామన్నారు. ప్రతీ వారం పాలకుర్తి, తొర్రూరు కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. తొలి ఆరు నెలల్లో సాగునీరు తెస్తానని చెప్పిన విధంగానే ప్రణాళికను అమలు చేస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా పనుల పురోగతిలో కొంత అలస్యం జరుగుతున్నాయని వెల్లడించారు. నిర్ధిష్ట గడువులో లక్ష్యాన్ని చేరుకొని, అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కర్నె సోమయ్య, మండల ఇన్‌చార్జి గుడిపూడి మధుకర్‌రావు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, డాక్టర్ పీ సోమేశ్వర్‌రావు, కాకిరాల హరిప్రసాద్, రామసహాయం కిశోర్‌రెడ్డి, లింగాల వెంకటనారాయణగౌడ్, మండల టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శ్రీనివాస్, కల్వకొలన్ ప్రవీణ్‌రాజు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...