పారదర్శకంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ


Sat,March 16, 2019 01:47 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 15: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌ల జిల్లా పరిశీలకుడిగా నియమితులైన శైలేంద్రసింగ్‌రావత్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జాయింట్ కలెక్టర్ ఎస్ దయానంద్‌తో ఈవీఎంలు, వీవీప్యాడ్‌ల భద్రత, ఈవీఎంల మాన్యువల్ అమలుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం గోదాంకు ఫెన్సింగ్, పోలీస్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రశాంత్‌జీవన్‌పాటిల్ వివరించారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్‌కు చెందిన 43 మంది ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో ఈవీఎంల మొదటి విడుత ర్యాండమైజేషన్, మాక్ పోలింగ్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. పర్యటనలో భాగంగా ఏనుమాముల మార్కెట్ గోదాములో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను శైలేంద్రసింగ్ రావత్ పరిశీలించి, భద్రత చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం, స్ట్రాంగ్ రూంల వద్ద రికార్డుల నిర్వహణను జేసీ దయానంద్ ఆయనకు వివరించారు. అనంతరం శైలేంద్రసింగ్ రావత్ భద్రకాళి అమ్మవారిని, వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీఏఎస్‌వో విజయలక్ష్మి, తహసీల్దార్లు బావ్‌సింగ్, రాజేశ్, డీటీలు రాజ్‌కుమార్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...