19వ డివిజన్.. కార్పొరేషన్ చరిత్రను తిరగరాసింది


Sat,March 16, 2019 01:47 AM

ఖిలావరంగల్, మార్చి 15: కార్పొరేషన్‌లోని 19వ డివిజన్ కార్పొరేటర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవం కావడం వరంగల్ మహానగర పాలకసంస్థ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే నరేందర్, ఉప ఎన్నికలో ఏకగ్రీవమైన దిడ్డి నాగరాజుతో కలిసి డివిజన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానికులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అలాగే యువత పెద్ద ఎత్తు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ ఏకగ్రీవానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తితో రాజకీయాలకు అతీతంగా తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, దిడ్డి నరేందర్, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు కోటేశ్వరమ్మ, టీఆర్‌ఎస్వీ విభాగం ప్రధాన కార్యదర్శి కలకొండ అభినాష్ తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...