ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతే


Fri,March 15, 2019 02:53 AM

-అభివృద్ధి చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు
-పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తాం
-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-పార్టీలో చేరిన వెంకటాపురం సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు
పరకాల, నమస్తే తెలంగాణ/సంగెం, మార్చి 14 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలంలోని వెంకటాపురం గ్రామ సర్పంచ్ సిలువేరు ఈశ్వరమ్మ, వార్డుసభ్యులతోపాటు సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలంతా మద్దతు తెలుపుతూ రెండోసారి ముఖ్యమంత్రిని చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాల అడ్రస్ లేకుండా పోయాయన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని కట్టబెడతామన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి అధిక మెజార్టీ వచ్చేలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గానే జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ రెబల్స్‌గా బరిలో నిలిచిన వారు, గెలిచిన వారంతా టీఆర్‌ఎస్‌లో తిరిగి చేరుతుండడంతో మరింత బలం పెరుగుతోందన్నారు.

పార్టీలో చేరింది వీరే..
వెంకటాపురం గ్రామ సర్పంచ్ సిలువేరు ఈశ్వరమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిలువేరు చిన్నయ్య, సిలువేరు రమేశ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సిలువేరు రాఘవ, మంగళపల్లి బాబు, సిలువేరు సంపత్, విజయలక్ష్మి శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే, సంగెం మండ లం కాట్రపల్లి గ్రామానికి చెందిన సొల్లే టి ప్రతాప్‌రెడ్డి, గాయపు మాధవరెడ్డి, సొల్లేటి తిరుపతిరెడ్డి, బాలన్ శేఖరయ్య తదితరులు కూడా పార్టీలో చేరడంతో వారిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ పరకాల మండల అధ్యక్షుడు బీముడి నాగిరెడ్డి, కౌన్సిలర్ మడికొండ సంపత్, నాయకులు రేగూరి విజయపాల్‌రెడ్డి, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జం రమేశ్, పర్నెం తిరుపతిరెడ్డి, సురేందర్‌రావు, ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బండి సారంగపాణి, ఎంపీటీసీ శ్రీనివాస్, సిలువేరు మొగిళి, ఇంగిలి వీరేశ్‌రావు పాల్గొన్నారు. అలాగే, కాట్రపల్లిలో గ్రామ సర్పంచ్ పలుగు సాగర్‌రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి,పూజారి గోవర్దన్‌గౌడ్, కర్ర విశ్వేశ్వర్‌రెడ్డి, జగన్, రాంచంద్రారెడ్డి, రాజశ్వేర్‌రెడ్డి, కట్ల ప్చోయ్య, పులుగు తిరుపతిరెడ్డి, జల్లిక ఐలయ్య, చెవ్వ రమేశ్ పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...