మార్కెట్ పనులు నెలలో పూర్తిచేయాలి


Fri,March 15, 2019 02:52 AM

-ఆదేశించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల కూరగాయల మార్కెట్ పనులను నెల రోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం పాత కూరగాయల మార్కెట్ స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయల మార్కెట్ ఆవరణలో ఫ్లోరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా ప్రారంభించాలన్నారు. పనుల నాణ్యతలో ఎలాంటి తేడాలున్నా సహించేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల్లో పనులు పూర్తి కావాలన్నారు. మార్కెట్ ప్రాంతం మొత్తం కలియతిరిగారు. చాపల మార్కెట్ కోసం వేరుగా షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కూరగాయల వ్యాపారులతో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. షెడ్లలోని గోడ ఎత్తును తగ్గించాలని వ్యాపారులు కోరడంతో తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ప్రజారోగ్య విభాగం డీఈ శ్రీనాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు మడికొండ సంపత్, ఆర్‌పీ జయంతిలాల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బీముడి నాగిరెడ్డి, నాయకులు రేగూరి విజయపాల్‌రెడ్డి, బొజ్జం రమేశ్, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, బండి సారంగపాణి, పాడి భగవాన్‌రెడ్డి, ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సాయి తిరుపతిరెడ్డి, మడికొండ శ్రీను, మార్కెట్ డైరెక్టర్ ఎండీ బియాబానీ, ఇంగిలి వీరేశ్‌రావు తదితరులున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...