ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు


Fri,March 15, 2019 02:51 AM

-మామునూరు ఏసీపీ జీ శ్యాంసుందర్
సంగెం, మార్చి 14 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని మామునూరు ఏసీపీ శ్యాంసుందర్ హెచ్చరించారు. మండలంలోని గవిచర్ల, రాంచంద్రాపురం గ్రామాల్లో బుధవారం రాత్రి పోలీసులు ఎన్నికల కోడ్‌పై అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గొడవలు చేసినట్లయితే కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు,ఎన్నికల అధికారులకు సహకరించి పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. ఈ సమావేశంలో పర్వతగిరి సీఐ శ్రీధర్‌రావు, సంగెం ఎస్సై ఎం నాగరాజు, గవిచర్ల ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, నాయకులు పత్తిపాక రమేశ్, బోంపెల్లి దిలీప్‌రావు, కత్తి రమేశ్‌తో పాటు గ్రామప్రజలు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి
పరకాల, నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నోడల్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సీ-విజిల్ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీ విజిల్ యాప్ వినియోగంపై ప్రజల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవగాహన తీసుకొస్తున్నామన్నారు. ్ల జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమలులో ఉందని ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పౌరులు సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయాలనే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి వెళ్లి తద్వారా క్షేత్ర పరిశీలన అధికారికి విచారణ నిమిత్తం పంపించడం జరుగుతుందన్నారు. 15 నిమిషాల్లోనే కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రదేశానికి ప్రత్యేక టీంలు చేరుకుంటాయన్నారు. క్షేత్రవిచారణ చేసి 30 నిమిషాల్లో తీసుకున్న చర్యను యాప్‌లో పొందుపర్చడం జరుగుతుందన్నారు. ఆ నివేదికపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి 50 నిమిషాల్లో నియమావళి ఉల్లంఘన జరిగితే చట్టరీత్యా చర్య తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి పురుషోత్తం, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దామెర : వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిబంధనలను మరింత కఠినతరం చేయడంలో భాగంగా సీ-విజిల్‌యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిందని మోడల్‌కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండలంలోని ఊరుగొండ శివారులోని విట్స్‌కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సీ-విజిల్‌యాప్‌పై వర్క్‌షాపును పరకాల ఆర్డీవో కిషన్, డీఎఫ్‌వో, స్వీప్‌నోడల్ అధికారి పురుషోత్తంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే సీ-విజిల్‌యాప్‌ను ఉపయోగించుకుని ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వీప్‌నోడల్ అధికారి పురుషోత్తం, ఆర్డీవో కిషన్, తహసీల్దార్ నాగరాజు, వీఆర్వో శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ ఎన్ శ్యాంకుమార్, వైస్ ప్రిన్సిపల్ టీ గోపాల్‌రావు, ఏవో యాదగిరి, కళాశాల పీఆర్వో రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారుపాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...