గులాబీ జోష్..!


Fri,March 15, 2019 02:50 AM

-మెజార్టీపైనే నేతల దృష్టి
-ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయం
-పల్లెల్లో ఒకటే నినాదం సారు, కారు, సర్కార్
-ఉత్సాహం నింపిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభ
-పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
-జోరందుకున్న చేరికలు
-పత్తాలేని ప్రతిపక్షాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభా ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మెజార్టీతో మూడు స్థానాలను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మాంచి జోష్‌మీదుంది. అదే స్ఫూర్తి, పట్టుదల లక్ష్య సాధనతో స్థానిక సంస్థల్లో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకొని జిల్లాలో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పుట్టించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అదే ఊపుతో పోటాటీగా మెజార్టీ సాధించాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్ నాయకులు ఉత్సహంతో ముందుకుసాగుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట శాసనసభా నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరుస విజయాలను తన సొంతం చేసుకుంటూ వస్తోంది. ఎన్నిక ఏదైనా ఈ శాసనసభా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌దే విజయం. ఆపార్టీకే మె జార్టీ ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలో ్లకూడా అదే ఫలితం కానుంది. ఇప్పటికే జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు అర లక్ష మెజార్టీ వచ్చే లా ప్రజలు తీర్పు చెప్పేలా ప్రతిపక్షనాయకుల్లో వణుకు పుట్టించారు. మరో వర్ధన్నపేట నియోజకవర్గంలో 94 వేల మెజార్టీని అందించారు. ఇలా వరుస విజయాలు అఖండమైన మెజార్టీనీ అందిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలు సారు, కారు, సర్కారు అంటూ నినదిస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపాలనే ఉద్ధేశంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భారీ బహిరంగ సభను నిర్వహించారు. జిల్లాలోని పార్టీ శ్రేణులకు మార్గ నిర్ధేశనం చేశారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల నగారా మోగటంతో ఇక జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని రచ్చబండలపై చర్చ పెట్టారు. పార్టీలకు అతీతంగా పథకాలు పొందుతున్న ఇతర పార్టీల నాయకులను కూడా కలిసి వస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా తీసుకెళ్తూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. పార్టీ అభ్యర్థులను మరోమారు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని కోరుతున్న దృశ్యాలను జిల్లాలోని ప్రతి పల్లెన కనిపిస్తున్నాయి.
కేటీ రామారావు బహిరంగ సభలో ఇచ్చిన ఈ పిలుపును అందిపుచుకున్న పార్టీ శ్రేణులు సొంతపార్టీ వారితో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఓట్లు అడుగుతున్న తీరు ఎంతో ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఈసారి ప్రతిపక్షాలను గ్రామస్థాయి నుంచి ఇరుకున పెడుతున్న తీరు రాజకీయ చర్చకు తెరలేపింది. ఏప్రిల్‌లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్నటికి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలను తిరగ రాయడంతో పాటు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి లక్షమెజార్టీ తగ్గకుండా చూసేవిధంగా స్థానిక శాసనసభ్యులు, పార్టీ బాధ్యులు, సమన్వయ కమిటీలు, తెలంగాణ రాష్ట్ర సమితి, దాని అనుబంధ సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నికల మూడ్ నుంచి ప్రజలు బయటకి రాకముందే సర్పంచ్ ఎన్నికలు ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు రావడం ఈ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని క్షేత్రస్థా యి పరిస్థితిని టీఆర్‌ఎస్ నాయకత్వం అంచనా వేసింది. ఇది తమకు ఎంతో మేళని కూడా ఆపార్టీ చెబుతున్నది.

పత్తాలేని.. ప్రతిపక్ష పార్టీలు..
జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీల ఊసే కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికల్లో అక్కడక్కడ బీరాలు పలికిన ప్రతిపక్షపార్టీల నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో చల్లబడ్డారు. శాసనసభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి ఇచ్చిన తీర్పుకు ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇంత దారుణమైన స్థితిలో ఉన్న ఆ పార్టీల వెంట ఉన్న కార్యకర్తలు, నాయకులు వారివారి నాయకులు గ్రామాలకు వస్తే స్పందించటం మాట ఎలా ఉన్నా బ్రతుకు జీవుడా అంటూ తప్పించుకు తిరుగుతున్నారని పేరు రాయటానికి ఇష్టపడని ఓ ప్రతిపక్ష నాయకుడు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ అటు ప్రచారం, ఇటు వరుస విజయాలతో దూసుకువెళ్తుంటే ఇతర పార్టీల శ్రేణులు దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌లోకి వలసలు..
వరుస విజయాలు, పార్టీకి సమర్థవంతమైన యువ నాయకత్వం, పారదర్శకతతో కూడిన పాలన, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యుడు ఆరూరి రమేశ్, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలలో చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో చేరికలు నిరంతర ప్రక్రియలా కొనసాగుతున్నాయి. ఇలా ప్రతీ రోజూ ఎన్నికలున్నా లేకున్నా ప్రతిపక్షాలను వదిలి వస్తున్న నాయకులను, కార్యకర్తలను టీఆర్‌ఎస్ నాయకత్వం అక్కున చేర్చుకుంటుంది. దీంతో ప్రతిపక్షపార్టీల పరిస్థితి అటు ప్రజాదరణ ఇటు అధికారం లేకపోవటంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...