జయముఖికి బెస్ట్ బడ్జెట్ వెహికిల్ -19 అవార్డు


Fri,March 15, 2019 02:49 AM

-రూ.1.50లక్షల వ్యయంతో రేసింగ్ కారు తయారీ
-చెన్నైలోని అవార్డు అందుకున్న విద్యార్థులు
నర్సంపేట రూరల్, ఫిబ్రవరి14 : అధ్యాపకుల నూతన బోధనా పద్ధ్దతులను ఆకలింపు చేసుకున్న పలువురు విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి అత్యుత్తమ అవార్డులను సొంతం చేసుకుంటున్నారు. మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో జయముఖి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల నిర్వహించిన ప్రతిభ పోటీల్లో ఉత్తమ అవార్డులు సాధించారు. కళాశాలకు చెందిన మెకానికల్ విభాగం విద్యార్థులు గత సంవత్సరం చెన్నై ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగిన ట్రాక్టర్ డిజైన్ కాంపిటేషన్ దేశవ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ కళాశాలలు పాల్గొనగా అందులో బెస్ట్ డిజైన్ అవార్డ్‌తో పాటు నగదు బహుమతిని పొందిన విషయం తెలిసిందే. ఇదే సూర్తితో కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పీ రంగయ్య, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లోక్‌నాథ్‌రావు, కళాశాల సంయుక్త కార్యదర్శి టీవీఆర్‌ఎన్‌రెడ్డి సాంకేతిక, సహాకారంతో ఇటీవల చెన్నైలోని జెప్సియార్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన జెపియార్ రేసింగ్ కార్ చాంపియన్‌షిప్‌లో మెకానికల్ విభాగాకి చెందిన 16 మంది విద్యార్థుల బృందం రెండు అవార్డులు సొంతం చేసుకుంది ఈ సందర్భంగా టీవీఆర్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ ధృడసంకల్పం, నిరంతర కృషితో ఏపనినైనా సాధించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి 25 ఇంజినీరింగ్ కళాశాలలు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన జయముఖి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. బెస్ట్ బడ్జెట్ వెహికిల్-2019లో ప్రథమ, బెస్ట్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో ద్వితీయ బహుమతితో రెండు అవార్డులు సాధించినట్లు పేర్కొన్నారు. మూడు నెలల పాటు శ్రమించి కేవలం రూ.1.50లక్షల వ్యయంతో రేసింగ్ కారును తయారు చేయడం అభినందించదగిన విషయమన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, సహాకరించిన అధ్యాపకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పీ రంగయ్య, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లోక్‌నాథ్‌రావు, అధ్యాపకులు తదితరులున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...