భానుడి భగభగ


Thu,March 14, 2019 01:32 AM

- మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం
- ఎండాకాలం మొదట్లోనే 37 డిగ్రీల ఉష్ణోగత్రలు
- రోడ్డెక్కాలంటే జంకుతున్న ప్రజలు
- ఏసీలు, కూలర్లకు పెరిగిన గిరాకీ


వరంగల్,నమస్తేతెలంగాణ : ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండాకాలం వచ్చిన మొదట్లోనే ఎండలు మండి పోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగత్రలకు జనం అల్లాడుతున్నారు. ఫిభ్రవరి చివరి వారం నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారం వచ్చేసరికి ఉష్ణోగత్ర 37 డీగ్రీలకు చేరింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు గడప దాటడం లేదు. అత్యవసరమనుకుంటేనే ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఫిబ్రవరి చివరిలో 32 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మార్చి నాటికి 37 డిగ్రీలకు పెరిగింది. ఉదయం 8 గంటల నుంచి ఎండలు మండిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు. గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏలా ఉండనుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. చలి కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలతో వణికిపోయిన ప్రజలు ఎండాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగతలు తీవ్ర స్థాయిలో ఉండటంతో వేడిని తట్టుకోలేక ప్రత్యామ్నయ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది వేస వి కాలంలో ఎండల తీవ్రత ఎ క్కువగా ఉంటుందని వాతావర ణ శాస్త్రవేతలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితిలపై ఇటీవల జరిగిన గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగరంలో ఎండలను దృష్ణిలో ఉంచుకుని ప్రజలకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు సూచించిన విషయం తెలిసిందే. అవసరమయితే వేసవి కాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై చర్చించేందుకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని పలువురు కార్పొరేటర్లు సూచించిడం ఎండల తీవ్రతకు అద్దం పడుతున్నది.

అల్లాడుతున్న జనం
మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. భవిష్యత్ ఎండలను తలుచుకుని భయపడుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం జంకుతున్నారు. కార్మికులు, హమాలీలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తుగానే జనం వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్ల వైపు దృష్టిసారిస్తున్నారు. రోడ్డెక్కాలంటేనే ఉండలను చూసి జనం అడుగు బయటపెట్టడం లేదు. అత్యవసరమనుకుంటేనే గడప దాటుతున్నారు. వేసవి కాలంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితులలో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ వేసవిలో ఎండలు దంచికోడుతాయని శాస్త్రవేత్తలు ముందస్తుగానే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు భవిష్యత్ వేసవి ఉష్ణోగ్రతలను ఊహించుకోని వణికి పోతున్నారు.

నిర్మానుష్యంగా రోడ్లు
మండుతున్న ఎండలతో నగర రోడ్లు నిర్మానుశంగా కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటల ఉంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యా హ్నం వరకు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో జనం రోడ్డుమీదికి రావడం లేదు. రోడ్లు జనం లేక నిర్మానుశంగా కనిపిస్తున్నాయి. మరో పక్షం రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలకు చేరుతుందన్న అంచనాలు వాతావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతేడాది మార్చిలో వేసవి ఉష్ణోగ్రతలు 32 డీగ్రీలు ఉండేవి. కానీ ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే 37 డీగ్రీలకు చేరింది. రాబోయే రెండు నెలలో వేసవి ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రత్యామ్నాయం వైపు పరుగులు
వేసవి ఉష్ణోగ్రతలు చుక్కలు చూపిస్తుండడంతో ప్రజలు ఎండ తీవ్రతలను తట్టుకునేందుకు ప్రత్యామ్నయం వైపు పరుగులు పెడుతున్నారు. బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్న ప్రజలు మాస్కులు, గ్లౌజ్‌లు ధరిస్తున్నారు. కూలర్లు, ఏసీ, ఫ్రిజ్‌లకు గీరాకి పెరిగింది. అప్పు చేసైనా జనం కూలర్లు, ఏసీ, ఫ్రీజ్‌లు కొనుగోళ్లు చేస్తున్నారు. లోకల్ ప్రిజ్‌లుగా పిలువబడే అదిలాబాద్ రంజన్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే నగరంలో అనేక సెంటర్లలో రంజన్ల స్టాల్‌లను ఏర్పాటు చేశారు. జనం వాటి వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో పాటు వేసవి పానీయాలకు గిరాకీ పెరిగింది. పండ్ల రసాలు, నిమ్మరసాలు, లస్సీ, మజ్జిగ, చలువ చేసే పండ్లు కొనుగోళ్లు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పిజ్జా, బర్గర్లకు గిరాకీ తగ్గింది. ముఖ్యంగా వేసవి ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ప్రత్యామ్న మార్గాలను వెతుకుతున్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...