వైభవంగా స్వయంభూలింగేశ్వరుడి రథోత్సవం


Thu,March 14, 2019 01:30 AM

మడికొండ, మార్చి 13: మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు పురస్కరించుకుని శివపార్వతుల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై ప్రత్యేక పూజలు చేపట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి, హారతి ఇచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామ పురవీధుల్లో శివపార్వతుల ఊరేగింపు కొనసాగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి హారతులిచ్చి స్వామివారికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇన్‌స్పెక్టర్ జాన్ నర్సింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లం శ్రీనివాసరావు, ఈవో రాజేందర్‌రావు, అర్చకులు అభిలాషశర్మ, మల్లికార్జునశాస్త్రి, రామాచార్యులు, విష్ణువర్ధనాచార్యులు, ధర్మకర్తలు ఆకుల శ్రీనివాసులు, పెద్ది ప్రభాకర్, గుర్రపు లలిత, గంగారపు రమేశ్, అరూరి తిరుపతి, మాజీ సర్పంచ్ ఆవాల రాధికారెడ్డి, బైరి కొమురయ్య, మద్దెల నారాయణస్వామి, పేపర్ రవి, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీస్వయంభూలింగేశ్వరుడి రథోత్సవంలో భాగంగా చిగురుపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మడికొండకు చెందిన మహిళలు కోలాటం, తాడ్వాయికి చెందిన ఆదివాసీలు, హైదరాబాద్‌కు చెందిన పోతరాజు విన్యాసాలు, తరాలపల్లికి చెందిన గొల్ల డప్పు, నల్లగొండకు చెందిన విచిత్ర వేషధారణ, వరంగల్‌కు చెందిన పేరిణి నృత్యంతో ఆద్యంతం అలరించారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...