ముగిసిన ఇంటర్ ద్వితీయ పరీక్షలు


Thu,March 14, 2019 01:30 AM

రెడ్డికాలనీ, మార్చి 13: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 27 నుంచి ప్రథమ, 28 నుంచి ద్వితీయ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. మొత్తం 44,493 మంది విద్యార్థులు పరీక్షల కోసం 55 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించామని డీఐఈవో లింగయ్య తెలిపారు. 23,525 మంది ఫస్టియర్ పరీక్షలకు, అలాగే 20,968 మంది సెకండియర్‌లో పరీక్షలు అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 55 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 1800 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించినట్లు ఇంకా అదనంగా ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో ఐదారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది.

చివరిరోజు 993 మంది గైర్హాజరు..
చివరి రోజు ద్వితీయ పరీక్షలలో మొత్తం 20, 242 మంది విద్యార్థులకు 19,249 మంది పరీక్ష రాయగా 993 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో లింగ య్య తెలిపారు. జనరల్ కోర్సుల్లో మొత్తం 19748 మంది విద్యార్థుల్లో 18850 పరీక్ష రాయగా 898 మంది గైర్హాజరైనట్లు, వొకేషనల్ కోర్సుల్లో 494 మంది విద్యార్థులకు గాను 399 మంది పరీక్షకు హాజరు కాగా 95 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

సంబరాల్లో విద్యార్థులు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగియడంతో విద్యార్థులు సంబరాల్లో మునిగిపోయారు. వారి ఆనందానికి అవధులు లేవు. పరీక్షలు పూర్తికావడంతో బయటకు వచ్చిన విద్యార్థులు కేరింతలతో ఉత్సాహంగా గడిపారు. ఎగ్జామ్ ఎలా రాశావ్.. ఎన్ని మార్కులు.. ఎంత పర్సంటేజి వస్తాయనుకుంటూనే భవిష్యత్ ప్రణాళికలు, కోర్సుల గురించి స్నేహితులు అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ పక్కనబెట్టి ముందుగా సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఇదిలా ఉండగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను ఆకర్షించేందుకు వివిధ విద్యాసంస్థలు రూపొందించిన కరపత్రాల పంపిణీ సందట్లో సడేమియాగా మారాయి.

ప్రారంభమైన మూల్యాంకనం
ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ నెల 7 నుంచి హన్మకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించినట్లు డీఐఈవో లింగయ్య తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తికావడం ముందుగానే మూల్యాంకనం ప్రారంభించినట్లు చెప్పారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...