లక్ష్యం ఐదు లక్షలు!


Wed,March 13, 2019 01:19 AM

- ఇదీ టీఆర్‌ఎస్ లెక్క
- సునాయాస మెజారిటీ లక్ష్యానికి మార్గాలివే అంటున్న గులాబీదారులు
- ఏడు నియోజకవర్గాల్లో ఇటీవల అసెంబ్లీ ఫలితాలను పోలుస్తూ కార్యాచరణ

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇటీవల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ స న్నాహక సమావేశంలో వరంగల్ లోకసభ నియోజకర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేసుకో వడం, ఇటీవల సాధించిన మెజారిటీని పరిగణనలోకి తీసుకొని బూత్‌ల వారీగా ఎక్కడ ఎక్కువ మెజారిటీని సాధించాం. అలా సాధించేందుకు అనుసరించిన వ్యూహం ఏమిటీ? ఎక్కడ తగ్గింది? ఆ తగ్గుదలకు కారణాలేమిటీ? అన్న అంశాలను సూక్ష్మస్థాయిలో పరిశీలన చేస్తూ పకడ్బంధీ కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా, మండలాల వా రీగా, గ్రామాల్లోని బూత్‌ల వారీగా వచ్చిన సాధించిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటూనే ఆయా బూత్‌ల్లో కలిసిరాని వారిని గుర్తించడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, నాయకులైనా సరే వారిని కలిసి వారి మద్దతు కోరే విస్తృత స్థాయి కార్యచరణకు టీఆర్‌ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఒకవై పు సూక్ష్మస్థాయి పరిశీలన చేస్తూ మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసివారి వారిని కలుపుకొనిపోయేలా కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమకు వచ్చిన ఓట్ల కంటే పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు సాధించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకర్గాల వారీగా మండలాల వారీగా పార్టీ శ్రేణులకు తగిన హోం వర్క్ ఇచ్చారు. ఆ శ్రేణులు బూత్‌ల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లెక్కల్ని బేరీజు వేసుకుంటున్నారు.

సునాయాస లక్ష్యమే..
ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన టార్గెట్‌ను సాధించేందుకు శాస్త్రీయమైన అంచనాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీపథకం వర్తించిన ప్రతీ ఒక్కరిని బూత్‌ల వారీగా పార్టీ శ్రేణులు కలవాలి. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ సీఎం కేసీఆర్ పథక లబ్ధిదారులే. అందరినీ ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉన్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ పథకం అన్ని పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అంతిమంగా పార్టీలకు అతీతంగా అనుభవించినవాళ్లే కనుక ప్రతీ ఒక్కరినీ కలిసి మద్దతు కోరవలసిందే అన్న హితవుతో పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొనకిసలాడుతున్నది. అయితే దీనికి శాస్త్రీయ ఆధారిత లెక్కల్ని బేరీజు వేసుకుంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ వరంగల్ లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజువేసుకొని, ప్రస్తుతం ఉన్న ఓట్ల సంఖ్యకు సరిపోల్చి చూస్తే ఇప్పటివరకే టీఆర్‌ఎస్ పార్టీకి నాలుగు లక్షల పైచిలుకు మోజారిటీని సొంతం చేసుకోగలిగాం. ఇంకా సాధించాల్సింది ఒక లక్ష అదనపు లక్ష్యమే ఎట్లా చూసినా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఐదు లక్షల మెజారిటీ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అంచనాలతో ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 55.50శాతం ఓట్లను కైవసం చేసుకున్నది. అదే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు దాదాపు 25.11 శాతంతో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఏడు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 55.50శాతం వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇదే ఏడు నియోజకవర్గాల్లో (వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతంతో సహా) కేవలం 30.39 శాతం ఓట్లే వచ్చాయి. అంటే ఈ లెక్కన ప్రస్తుతం లోక్‌సభ పరిధిలో ఉన్న ఓట్లతో పరిశీలిస్తే టీఆర్‌ఎస్ మెజారిటీ నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే వచ్చేసిందని అంచనాతో ఉన్నారు.

మెజారిటీ కోసం పోటాపోటీ..
అసెంబ్లీ ఎన్నికల నాటి పార్టీ పరిస్థితి కన్నా ఇప్పటి పరిస్థితి మరింత మెరుగైందని, రాష్ట్రంలో తిరుగులేని అజేయశక్తిగా ఉన్న పార్టీకి, ఏడు నియోజకవర్గాల్లో ఐదు లక్షల మెజారిటీ సాధించడం పెద్ద విషమేమీ కాదని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇటీవల వరంగల్ ఓసిటీ మైదానం లో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు ఒక్క రొక్కరుగా ఐదు లక్షల లక్ష్యాన్ని సాధిస్తామని, వాగ్దానం చేశారు. అంతేకాదు అందరికీ అందరం పోటీపడీ నియోజకవర్గానికి భారీ మెజారిటీని సాధించి తీరుతామని ప్రకటించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తమతమ నియోజకవర్గాల్లో లక్ష మెజారిటీ సాధించి తీరుతామని ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఇలా ఎమ్మెల్యేలు అందరూ కచ్చితంగా ఐదు లక్షల మె జారిటీని సాధించి తీరుతామని ప్రకటించడం విశేషం. వేదిక మీద తాము ప్రకటించి ఊరుకోవడం మాత్రమే కాదు అందుకు తగ్గ కార్యాచరణను రూపొందిస్తామని అన్నట్టుగానే ఎమ్మెల్యేలు ఎక్కడున్నా, అభ్యర్థి ఎవరైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో, సమన్వయ లోపంతో ఓటమిపాలైనా మా భూపాలపల్లి నియోజకర్గం ఈ సారి బద్లా తీర్చుకుంటుంది అంటూ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేయటం విశేషం.

ఐదు లక్షల మెజారిటీ ఇచ్చుడే..
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సభ సాక్షిగా ఐదు లక్షల మెజారిటీ ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఆరు అసెంబ్లీ ని యోజకవర్గాల కంటే పాలకుర్తి నియోజకర్గంలో ఎక్కువ మెజారిటీ సాధించేందుకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. బూత్‌ల వారీగా ఉన్న ఓటర్లు?, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలతో సూక్ష్మస్థాయిలో కార్యాచరణ అమలు పరచాలని పార్టీ శ్రేణులను ఆదేశించాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...