ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతం


Wed,February 20, 2019 02:18 AM

-మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్వేతార్కలో ప్రత్యేక పూజలు
కాజీపేట : కాజీపేట పట్టణంలోని శ్రీశ్వేతార్క మూల గణపతి దేవాలయంలో మం గళవారం మాగ పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధ్దాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం తెల్లవారు జాము నుంచే దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోయిందని తెలిపారు.
శ్వేతార్కడికి భక్తులతో వివిధ సముద్రాల నుంచి తెప్పించిన జలాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సామూహిక వ్రతాలకు పట్టణంతో పాటుగా చుట్టు పక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయినవోలు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, త్రిగుళ్ల శ్రీనివాసశర్మ పాల్గొన్నట్లు తెలిపారు. దేవాలయ నిర్వాహణ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...