పీఎం ఎక్స్‌లెన్సీ అవార్డ్‌కు వరంగల్ మార్కెట్ పోటీ


Tue,February 19, 2019 03:13 AM

కాశీబుగ్గ, ఫిబ్రవరి 18: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డ్‌కు పోటీ పడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ యస్.దయానంద్ తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని 28 రాష్ర్టాల్లో జాతీయ వ్యవసాయ మార్కెట్, ఈ-నామ్ పద్ధ్దతిని అమలు చేస్తున్న మార్కెటింగ్ అధికారుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో జేసీ, మార్కెట్ ప్రత్యేక అధికారి దయానంద్, మార్కెట్ కార్యదర్శి సంగయ్యలు పాల్గొన్నారు. జిల్లా నుంచి మార్కెటింగ్ అధికారులతో పాటు సమావేశంలో పాల్గొని ఇక్కడ అమలు చేస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌యాక్షన్స్ వివరాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. వాటిలో 19 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఈ-నామ్ పద్ధ్దతిలో కొనుగోలు చేసిన ట్రేడర్లు రైతుల ఖాతాలకు నేరుగా సొమ్ము జమచేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 204 ఈ-నామ్ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఆయా ట్రేడర్లు ఇతర మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి బిడ్డింగ్ జరిపి, కొనుగోలు చేసిన సరుకులకు నాణ్యతా గ్యారెంటీని ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర అధికారులకు సూచించారు. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్ పెరిగి రైతులకు మరింత మెరుగైన ధరలు లభిస్తాయని చెప్పారు. అలాగే ట్రేడర్లు లావాదేవీలకు అనుగుణంగా ఈ-మార్కెట్‌లో కొంత రివాల్వింగ్ ఫండ్ వలన ఆయా మార్కెట్ యార్డుల్లో జరిగిన కొనుగోలు, చెల్లింపులపై మార్కెటింగ్ అధికారులకు అవగాహన ఉంటుందని చెప్పారు. మన రాష్ట్రం నుంచి సూర్యాపేట, తిరుమలగిరి, కేసముద్రం, మహబూబాబాద్, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లలో కూడా ఈ-నామ్ మార్కెటింగ్ వ్యవస్థను నెలకొల్పారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...