ఎక్స్ సర్వీస్‌మెన్ కస్పారెడ్డి మృతి


Tue,February 19, 2019 03:12 AM

సిద్ధార్థనగర్, ఫిబ్రవరి 18: ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఎక్స్‌సర్వీస్‌మెన్ గాదె కస్పారెడ్డి(72) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో సోమవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాజీపేట సిద్ధార్థనగర్‌లోని తన స్వగృహానికి సోమవారం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇతను 1971 సంవత్సరంలో పాకిస్తాన్ దేశంతో యుద్దంలో పాల్గొన్నాడని, ఆ యుద్దంలో తన కాలును కోల్పోయాడని తెలిపారు. ఆర్మి నుంచి రిటైర్డ్ అయిన అనంతరం ఆయన ఎఫ్‌సీఐలో చాలా కాలం పనిచేశారని తెలిపారు. మంగళవారం 11.30నిమిషాలకు ఫాతిమానగర్‌లోని ఫాతిమాకెథడ్రల్ చర్చిలో ప్రత్యేక పూజ అనంతరం అదే ప్రాంగణంలో భూస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...