20న బల్దియా సర్వసభ్య సమావేశం


Tue,February 19, 2019 03:12 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : ఈ నెల 20న మహా నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న బుధవారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాలుల్లో సమావేశం జరుగుతుందన్నారు. ఇన్‌చార్జి మేయర్ ఖాజాసిరాజుద్దీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చసాగుతుందని అన్నారు. కార్పొరేటర్లు సకాలంలో హాజరు కావాలని ఆమె కోరారు.21న బడ్జెట్ మావేశం
21న గ్రేటర్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2019-20 ఆర్థ్ధిక సంవత్పరం బడ్జెట్‌పై సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఏడాది తర్వాత సమావేశం జరగడం గమనార్హం.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...