స్మార్ట్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి


Tue,February 19, 2019 03:11 AM

వరంగల్, నమస్తేతెలంగాణ : గ్రేటర్‌లో జరుగుతున్న స్మార్ట్‌రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని గ్రేటర్ కమిషనర్ రవికిరణ్ అన్నారు. సోమవారం ఆయ న నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. పద్మాక్షి అలయం ప్రాంతంలో జరుగుతున్న స్మార్ట్‌రోడ్డు పనులను అయన పరిశీలించారు. 31వ డివిజన్‌లోని కుడా ఎన్‌క్లేవ్‌తో పాటు వాజ్‌పాయ్ నగర్, గాంధీ నగర్ పార్క్‌లను పరిశీలించారు. 46వ డివిజన్‌లోని గోపాల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ వాజ్‌పాయ్, గాంధీనగర్‌లోని పార్క్‌లలో మౌళిక వసతులు కల్పించాలని అన్నారు.పార్కులకు వచ్చే వారి కోసం బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని అన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరావు, డీఈ స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...