ఉర్సు చెరువుకు మహర్దశ


Mon,February 18, 2019 03:08 AM

-మైదానం.. ఉర్సుగుట్ట అదనపు ఆకర్షణ
-పురాతన ఆలయం.. ప్రాచీనలిపి
-ట్యాంక్‌బండ్.. లైటింగ్ వెలుగులు
-టూరిజం స్పాట్‌గా అభివృద్ధికి చర్యలు


కరీమాబాద్, ఫిబ్రవరి 17 : వరంగల్ మహానగరంలోని ఉర్సు చెరువుకు మహార్ధశ పట్టనుంది. కాకతీయలు కాలంనాటి గొలుసుకట్టు చెరువుల్లో ఒకటిగా చెప్పుకునే ఉర్సు చె రువు మున్ముందు పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతుంది. ప్రకృతి అందాల సోయగానికి అభివృద్ధి మెరుగు లు కనువిందు చేయనున్నాయి. ఆహ్లాదకరమైన చెరువుతో పాటుగా ఆకట్టుకునే గుట్ట అందాలతో ఉన్న రంగలీల మైదా నం టూరిజం స్పాట్‌గా రూపు దిద్దుకోనుంది. ప్రభుత్వ స హకారంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దీటుగా ఉర్సు చెరువును అభివృద్ధి చేసి ప్రజలను అబ్బుర పరిచేం దుకు కసరత్తు చేపట్టారు. ప్రకృతి అందాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పనులతో ఉర్సు చెరువు రాను న్న రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. అమృత్, స్మార్ట్ పథకంతో అందరి దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఎమ్మెల్యే నన్నపునేని చొరవ అధికారులు చేస్తున్న కృషితో ఉర్సు చెరువు, ఉర్సు గుట్ట, రంగలీల మైదానం రూపురేఖలు మారనున్నాయి.

టూరిజం స్పాట్‌కు చర్యలు..


దాదాపుగా 130 ఎరకాల్లో విస్తరించి ఉన్న రంగసము ద్రం చెరువును టూరిజం స్పాట్‌గా మలిచేందుకు అధికారు లు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చేపట్టిన అభివృద్ధి పనులతో చెరువుకు పూర్తిస్థా యి జలకళ సంతరించుకుంది. నూతనంగా చేపట్టిన చెరువుకట్ట నిర్మాణం ట్యాంక్‌బండ్‌ను మరిపిస్తోంది. మరో వై పున కుడా ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పనులను సైతం చే పట్టారు. దీంతో పాటుగా చెరువు కట్ట చుట్టూ లైటింగ్‌కు ఏ ర్పాట్లు చేస్తున్నారు. చెరువులో బోటింగ్, వాటర్ పౌంటెన్ నిర్మించేందుకు ప్రయత్రాలు సాగిస్తున్నారు. ఉర్సు చెరువు లో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహించిన బోటింగ్ పోటీలకు వేదికగా సైతం మా రింది. ప్రభుత్వం కోమటి చెరువు తరహాలో అభివృద్ధి చేయాలని చూస్తున్న ప్రణాళికలతో ఈ ప్రాంతం మరింతగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.

ఆకట్టుకునే గుట్ట..


రంగలీలమైదానంలో ఎత్తుగా విస్తరించి ఉన్న గుట్ట అకట్టుకునే విధంగా ఉంది. ఎత్తైన బండరాళ్లు గుట్టపై నుంచి జాలువారే నీరు తో నిత్యం కనువిందు చే స్తుంది. సహజ సిద్దమైన గుట్ట దానిని ఆనుకుని ఓ వైపు చెరువు, మరోవైపు మైదానం, ఇంకోవైపు పొ లాలు ఇలా పలు రకాలు గా ఉన్న ప్రదేశాలతో బా టసారులను మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ఉర్సుగుట్టపైకి వెళ్తే చుట్టు పక్కల ప్రాంతాల అందా లు కళ్లకు కనిపిస్తాయి. అన్నింటికీ అనువుగా ఉన్న ఉర్సుగుట్టపై అధికారులు ప్రత్యేక చొరవతో రాక్‌ైక్లెంబింగ్ నిర్వహించేదుకు సైతం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఓ సారి ఇక్కడ రాైక్లెంబింగ్ సైతం నిర్వహించడం విశేషం.

పురాతన ఆలయం.. ప్రాచీనలిపిలు..


ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఉర్సు గుట్టపైన కొలు వై ఉన్న శ్రీగోదాసహిత రంగనాథస్వామి ఆలయంతో ఇక్క డ ఆధ్యాత్మికతకూ చోటుంది. గుట్టకు వెలిసిన శ్రీ గోదాసహిత రంగనాథస్వామి విగ్రహంతో పాటుగా అనేక విగ్రహా లు గుట్టపై దర్శనమిస్తాయి. స్వామివారు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడే కొలువై ఉన్నడన్న ప్రచారం ఉంది. గుట్టపై కనిపించే ఎన్నో ఆనవాళ్లు మన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తా యి. గుట్టపై ఉన్న సొరంగమార్గాలు అందులో ఉన్న రాత లు చరిత్రకు నిదర్శనం. గుట్టపై ఉన్న ఆలయం కింది భాగా న ఉన్న కోనేరు రాజు కుటుంబీకులు స్నానాలు చేసినట్టుగా పూర్వీకులు చెప్పడం గమనార్హం. పలు పండుగల్లో ఏటా ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొంటారు. దీనికి తోడు ఉర్సుగుట్టపై ఉన్న లిపిపై మేధావులు, ప్రొఫెసర్లు అనేక పరిశోధనలు చేపట్టారు.

అభివృద్ధికి ప్రణాళికలు..


ఉర్సు చెరువు, రంగలీల మైదానంలో పలు అభివృద్ధి ప నులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వాకింగ్‌ట్రాక్, పా ర్కు, సైకిల్‌ట్రాక్, యోగా సెంటర్, ఓపెన్‌జిమ్, చిల్డ్రన్స్‌పార్కు, ఆడిటోరియం తదితర నిర్మాణాలకు ప్రణాళికలను రూపొందించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...