వీరజవాన్ తల్లి పాదాలను కడిగిన నాయకులు


Mon,February 18, 2019 03:06 AM

కరీమాబాద్, ఫిబ్రవరి17: దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల త్యాగాలు మరువలేనివని టీఆర్‌ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి అన్నారు. వరంగల్ ఉర్సులోని వీరజవాన్ సతీష్ విగ్రహానికి పాలాభిషేకం చేపట్టి సెంటర్‌లో వీరజవాన్ తల్లి మాడిశెట్టి సుజాతను శాలువాతో సత్కరించి ఆమె పాదాలను పాలతో కడిగారు. ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ దొంగ దెబ్బ తీసి భారత జవాన్లను బలితీసుకున్న ఉగ్రవాద ముష్కరులు, వారికి సహకరించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడెపు రవీందర్, బొల్లం రాజు, నర్మెట్ట కుమారస్వామి, గుడిమెల్ల రాజు, వడికిచెర్ల ప్రసాద్, వడికిర్ల నితిన్, మట్టెవాడ కుమార్, మాగంటి శివ, రఘు, సంపత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...