హెచ్‌సీ ప్రకాశ్‌కు సీపీ, ఎమ్మెల్యే నివాళి


Mon,February 18, 2019 03:05 AM

నయీంనగర్,ఫిబ్రవరి17: వరంగల్ కోర్టులో శనివారం హఠాత్తుగా మృతి చెందిన కానిస్టేబుల్ సాయి ని ప్రకాశ్ మృతదేహాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. వికాస్‌నగర్‌లోని ప్రకాశ్ నివాసంలో ఆయన భౌతికాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ 1992లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 2018లో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ పోలీసుస్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నివాళులర్పించిన వారిలో సుబేదారి, ఆత్మకూరు సీఐలు సదయ్య, మహేందర్, ఎస్సై సతీశ్, పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, 1992 బ్యాచ్ కానిస్టేబుళ్లు, తదితరులు ఉన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...