రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు


Mon,February 18, 2019 03:05 AM

రాయపర్తి: వరంగల్ నుంచి ఖమ్మంవైపు వేగంగా వెళ్తున్న గ్రానెట్ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై జలకం లక్ష్మణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ వెంకటేశ్వర్లు తన కుమారుడైన కపిల్‌ను తీసుకుని తమ మోటార్ సైకిల్‌పై రాయపర్తి మండల కేంద్రంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన కాటమయ్య పండుగకు హాజరయ్యారు. వేడుకలు ముగించుకున్న అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న గ్రానెట్ లారీ వీరి మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...